Sa T20 League: వరుసగా రెండో సారి ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ - టీ20 లీగ్‌లో రికార్డ్
Sa T20 League: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఫైనల్ చేరింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో డర్బన్‌పై 51 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
Sa T20 League: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. బ్యాటింగ్‌లో డేవిడ్ మలన్, బౌలింగ్‌లో జాన్సేన్, బార్ట్‌మన్ సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించారు.
హెర్మాన్ మెరుపులతో...
ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. సన్ రైజర్స్‌ను హాఫ్ సెంచరీతో డేవిడ్ మలన్ గట్టెక్కించాడు. 45 బాల్స్‌లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మలన్ 63 పరుగులు చేశాడు. ఓపెనర్ హెర్మన్ 21 పరుగులతో రాణించాడు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో సన్‌రైజర్స్ మోస్తారు స్కోరు చేసింది.
కెప్టెన్ మార్‌క్రమ్ 23 బాల్స్‌లో 30 పరుగులు చేశాడు. చివరి వరకు బ్యాటింగ్ చేసిన భారీ షాట్స్ కొట్టలేకపోయాడు. డర్బన్ బౌలర్లలో కేశవ్ మహరాజ్, దలా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. టోప్లే వికెట్లు తీయలేకపోయిన పరుగుల్ని నియంత్రించాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన టోప్లే 14 పరుగుల మాత్రమే ఇచ్చాడు.
తడబడిన డర్బన్
సింపుల్ టార్గెట్‌ను ఛేదించడంలో డర్బన్ తడబడింది. 19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. మల్డర్ 38 పరుగులతో డర్బన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అతడికి మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి సహకారం లభించలేదు. స్టార్ ప్లేయర్ డికాక్ 23 బాల్స్‌లో 20 పరుగులతో నిరాశపరిచాడు. హిట్లర్లు క్లాసేన్, ప్రిటోరియస్ కూడా ధాటిగా ఆడలేకపోయారు. క్లాసెన్ 23, ప్రిటోరియస్ ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.
సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్, బార్ట్‌మన్ తలో నాలుగు వికెట్లు తీసుకున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో డర్బన్‌ను దెబ్బకొట్టారు. డాసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన ఫైనల్ చేరేందుకు డర్బన్‌కు మరో అవకాశం మిగిలి ఉంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో పార్ల్ రాయల్, జోబర్గ్ సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. బుధవారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో ఫైనల్ పోరు కోసం డర్బన్ తలపడనుంది.
గత ఏడాది ఛాంపియన్స్...
గత ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్‌లోనే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. గత ఏడాది ఫైనల్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఫైనల్‌లో అడుగుపెట్టి ఈ టీ20 లీగ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్‌కు ఇండియాకు చెందిన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు కూడా సన్ గ్రూప్ ఓనర్‌గా వ్యవహరిస్తోంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న మార్‌క్రమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా కొనసాగుతోన్నాడు.
టాపిక్