TG MHSRB Exams 2024 : మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పరీక్షలు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి-telangana multipurpose health assistant exam hall tickets released ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Mhsrb Exams 2024 : మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పరీక్షలు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TG MHSRB Exams 2024 : మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పరీక్షలు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Basani Shiva Kumar HT Telugu
Dec 21, 2024 03:54 PM IST

TG MHSRB Exams 2024 : మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా హాల్ టికెట్లను విడుదల చేశారు. https://myapplication.in/TGMHSRB/MPHA/MPHA_GET_HALLTICKET.aspx లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పరీక్షలు
మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పరీక్షలు

తెలంగాణలోని ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీని ప్రభుత్వం వేగవంతం చేసింది. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ బోర్డు హాల్ టికెట్లను విడుదల చేసింది. https://myapplication.in/TGMHSRB/MPHA/MPHA_GET_HALLTICKET.aspx లింక్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 29న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.

అభ్యర్థులకు సూచనలు..

1.అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

2.హాల్ టికెట్లను ఏ4 సైజ్‌లో ప్రింట్ తీసుకోవాలి. దాని అభ్యర్థి ఫొటోను అతికించి, సంతకం చేయాలి. ఈ రెండు స్పష్టంగా ఉంటేనే చెల్లుబాటు అవుతుంది.

3.హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడంతో ఏదైనా ఇబ్బందులు ఉంటే.. పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 7416908215 నంబర్‌కు కాల్ చేయొచ్చు.

4.పరీక్ష కేంద్రంలోని ప్రవేశించే సమయంలో కచ్చితంగా హాల్ టికెట్లను చూపించాలి.

5.హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో, సంతకం లేకపోతే.. 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, గెజిటెట్ ఆఫీసర్ ధ్రువీకరించిన హామీ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.

6.పరీక్షలకు వచ్చే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు.. ప్రభుత్వం గుర్తించి పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాలి.

7.అభ్యర్థుల నమోదుకు సమయం పడుతుంది కాబట్టి.. నిర్ణీత రిపోర్టింగ్ కంటే ముందే వస్తే మంచిది.

8.రిజిస్ట్రేషన్ సమయంలో బయోమెట్రిక్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు చేతులకు మెహందీ, ఇంక్, టాటూలు లేకుండా చూసుకోవాలి.

9.పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. మధ్యాహ్నం 2.45 గంటల లోపే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లాలి.

10.అభ్యర్థులు వారికి కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సెంటర్ మార్పు ఉండదు.

పరీక్షా కేంద్రాలు..

ఆదిలాబాద్

హనుమకొండ

హైదరాబాద్

కరీంనగర్

ఖమ్మం

కోదాడ

కొత్తగూడెం

మహబూబ్ నగర్

మంథని

నల్గొండ

నిజామాబాద్

పెద్దపల్లి

సంగారెడ్డి

సిద్ధిపేట

సూర్యాపేట

వరంగల్

Whats_app_banner