Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్-my solo movie coming after fours years says ram charan at game changer dallas event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 03:03 PM IST Chatakonda Krishna Prakash
Dec 21, 2024, 02:59 PM , IST

  • Ram Charan: గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్‍లో నేడు (డిసెంబర్ 21) జరగనుంది. దీనికంటే ముందు జరిగిన ఫ్యాన్స్ మీట్‍లో రామ్‍చరణ్ మాట్లాడారు.

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో అమెరికాలోని డల్లాస్ వేదికగా నేడు (డిసెంబర్ 21) ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను మూవీ టీమ్ నిర్వహిస్తోంది. 

(1 / 6)

ప్రీ-రిలీజ్ ఈవెంట్ కంటే ముందు ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్‍లో రామ్‍చరణ్ మాట్లాడారు. తన సోలో మూవీ వచ్చిన నాలుగేళ్లుపైగానే అయిందని అన్నారు. 

(2 / 6)

“నా బ్రదర్ తారక్‍తో ఆర్ఆర్ఆర్ చేశాను. కానీ సోలో ఫిల్మ్ వచ్చి నాలుగేళ్లకు పైగానే అయింది. మూడున్నరేళ్ల పాటు గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం” అని రామ్‍చరణ్ అన్నారు. 

(3 / 6)

గేమ్ ఛేంజర్ సినిమా డైరెక్టర్ శంకర్ స్టైల్‍లో ఉంటుందని రామ్‍చరణ్ చెప్పారు, సంక్రాంతికి ఈ మూవీ అద్భుతంగా ఉంటుందని, తాము అసలు నిరుత్సాహపరచబోమని అన్నారు.

(4 / 6)

రామ్‍చరణ్ సోలో హీరోగా వచ్చిన లాస్ట్ సినిమా వినయ విధేయ రామ (2019). ఆ తర్వాత 2022లో ఆర్ఆర్ఆర్ వచ్చినా దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించారు. అదే ఏడాది ఆచార్య కూడా రిలీజైనా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ చిత్రంలో నటించారు. దీంతో ఆ రెండూ మల్టీస్టారర్ చిత్రాలయ్యాయి.

(5 / 6)

దీంతో వినయ విధేయ రామ తర్వాత.. సుమారు ఐదేళ్లకు రామ్‍చరణ్ సోలో హీరోగా గేమ్ ఛేంజర్ వస్తోంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ సంక్రాంతి సందర్భంగా వచ్చే నెల జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు