Coriander Storage: కొత్తిమీర త్వరగా కుళ్లిపోతుందా..? ఇలా ఎండ బెట్టి నిల్వ చేసుకోండి ఏళ్ల తరబడి ఉపయోగపడుతుంది-does coriander rot quickly store it in sunbed like this and it will be useful for years ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coriander Storage: కొత్తిమీర త్వరగా కుళ్లిపోతుందా..? ఇలా ఎండ బెట్టి నిల్వ చేసుకోండి ఏళ్ల తరబడి ఉపయోగపడుతుంది

Coriander Storage: కొత్తిమీర త్వరగా కుళ్లిపోతుందా..? ఇలా ఎండ బెట్టి నిల్వ చేసుకోండి ఏళ్ల తరబడి ఉపయోగపడుతుంది

Ramya Sri Marka HT Telugu
Dec 21, 2024 06:30 PM IST

Coriander Storage: శీతాకాలంలో కొత్తిమీర ఎక్కువగా దొరుకుతుంది. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొత్తిమీరను ఎక్కువ కాలం కుళ్లిపోకుండా ఆపలేం. కనుక పచ్చి కొత్తిమీరను తీసుకుని ఎండబెట్టడం వల్ల చాలా రోజులు నిల్వ చేయచ్చు. నెలల తరబడి దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

కొత్తిమీర త్వరగా కుళ్లిపోతుందా..? ఇలా ఎండ బెట్టి నిల్వ చేసుకోండి
కొత్తిమీర త్వరగా కుళ్లిపోతుందా..? ఇలా ఎండ బెట్టి నిల్వ చేసుకోండి (shutterstock)

శీతాకాలంలో పచ్చి కొత్తిమీర పుష్కలంగా లభిస్తుంది. అలా అని తెచ్చుకున్న కొత్తిమీర అంతా ప్రతిసారి పూర్తిగా ఉపయెగించలేం. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొత్తిమీర ఆకులను ఎక్కువ కాలం కుళ్లిపోకుండా ఆపలేం. ఎందుకంటే సాధారణంగా కొత్తిమీర ఆకులు త్వరగా కుల్లిపోతుంటాయి. కొత్తిమీర నిల్వ చేసేందుకు రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ నెలల తరబడి దాన్ని తాజాగా నిలపలేవు. అందుకే కొత్తిమీర ప్రియుల కోసం ఇవాళ కొత్త ఐడియాతో మీ ముందుకు వచ్చాం. పచ్చి కొత్తిమీర ఆకులను ఎక్కువ కాలం నిల్వ ఉంచలేం కనుక దాన్ని కొత్త పద్ధతిలో ఎండబెట్టి నిల్వ చేయచ్చు. ఇలా చేయడం వల్ల నెలల తరబడి నిల్వ చేయచ్చు. వేసవి లాంటి కొత్తిమీర దొరకని సీజన్లలో కూడా దాని రుచిని మీరు ఆస్వాదించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..

కొత్తిమీరను ఎండబెట్టే పద్ధతి..

  • కొత్తిమీరను ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే ముందుగా మీరు తెచ్చుకున్న కొత్తిమీరను శుభ్రంగా కడిగాలి.
  • కడిగిన కొత్తిమీర ఆకులను ఎండలో ఆరబెట్టారు.
  • కొత్తిమీరలో నుంచి నీరంతా ఎండిపోయిన తర్వాత మైక్రోవేవ్ లో ఆ ఆకులను పెట్టి రెండు మూడు సార్లు అటూ ఇటూ తిప్పాలి.
  • మైక్రోవేవ్ లేకపోతే కొత్తిమీర ఆకులను కడాయిలో లేదా ప్యాన్ లో వేసి వేయించుకోవాలి. చాలా తక్కువ వేడిలో మాత్రమే కొత్తిమీరను వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర పూర్తిగా ఆరుతుంది. ఎక్కువ వేడి తగిలిందంటే కొత్తిమీర పాడవుతుందని మర్చిపోకండి.
  • ఆకులు బాగా ఆరిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.
  • ఆ పొడిని తర్వాత గాలి చొరబడని కంటైనర్లో నింపి దాచుకోవాలి.
  • నెలలు గడిచిపోయినా సరే ఈ పొడి పచ్చి కొత్తిమీర ఆకుల రుచిని ఇస్తుంది. ఈ పొడిని కొత్తిమీర లేనప్పుడు, దొరకనప్పుడు ఉపయోగించుకోవచ్చు.
  • కొత్తిమీర పొడి కూరల్లో, పానీ పూరీ వాటర్, చారు వంటి ఎలాంటి ఆహర పదార్థంలో అయినా వేసుకోవచ్చు.
  • పచ్చి కొత్తిమీర ఆహార పదార్థాలకు ఎలాంటి సువాసన అందిస్తుందో ఈ పొడి కూడా అంతే తాజా సువాసనను, రుచిని అందిస్తుంది.

కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలు:

  • కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ శరీరంలోని హానికరమైన విషాలను తొలగించడానికి సహాయపడతాయి. శరీరంలో రక్త నిర్మాణం పెంచుతాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
  • రక్తం శుద్ధి చేసే ప్రక్రియలో కొత్తిమీర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తప్రసరణ పెంచి శరీరంలోని వివిధ అవయవాలకు సరైన ఆక్సిజన్ సరఫరా అందించడంలో సహాయపడుతుంది.
  • కొత్తిమీరలో పోషకాలు జీర్ణవ్యవస్తను బలపరచడంతో పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగస్తాయి. ఇవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి.
  • కొత్తిమీరలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • ఆరోగ్యకరమైన జుట్టు కోసం కావాల్సిన విటమిన్ సీ, విటమిన్ ఏ, ఐరన్ వంటివి కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు సమస్యలను నివారిస్తాయి.
  • కొత్తిమీర చర్మారోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముడతలు, పిగ్మెంటేషన్ వంటి అనేక సమస్యల నుంచి కాపాడుతుంది.
  • కొత్తిమీరలో 90శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. నీటి కొరత నుంచి రక్షిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం