తెలుగు న్యూస్ / ఫోటో /
Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)
- Anupama Parameswaran Janaki Vs State Of Kerala: అనుపమ పరమేశ్వరన్ బాధితురాలిగా నటిస్తున్న సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలపై లుక్కేస్తే..!

(1 / 6)
టాలీవుడ్ పాపులర్ హీరోయిన్స్‌లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీతో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
(2 / 6)
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జె.ఎస్.కె) మూవీలో అనుపమ పరమేశ్వరన్ బాధితురాలిగా కనిపించనుందను తెలుస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక కోరణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ.
(3 / 6)
కోర్ట్ రూమ్ డ్రామాగా వస్తున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి నటిస్తున్నారు. బాదితురాలు జానకి తరఫున వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి యాక్ట్ చేస్తున్నారు.
(4 / 6)
ఇదివరకే మలయాళంలో విడుదలై మంచి హిట్ కొట్టిన ఈ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జానకి పై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు.
(5 / 6)
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరించారు.
ఇతర గ్యాలరీలు