తెలుగు న్యూస్ / ఫోటో /
TG Indiramma Housing Survey : అలాంటి వారికి 'ఇందిరమ్మ' ఇళ్లు రాదు..! ఈ విషయాలను తెలుసుకోండి
- ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించటం కోసం సర్వే జరుగుతోంది. యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో వివరాలను క్రోడీకరించి… అసలైన అర్హులకే స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. అయితే గతంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారిని పక్కనపెట్టనున్నారు.
- ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించటం కోసం సర్వే జరుగుతోంది. యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో వివరాలను క్రోడీకరించి… అసలైన అర్హులకే స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. అయితే గతంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారిని పక్కనపెట్టనున్నారు.
(1 / 6)
తెలంగాణలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నడుస్తోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతిదీ యాప్ లో నమోదు చేస్తున్నారు. ఈనెలాఖారులోపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది.
(2 / 6)
గ్రామాలు, వార్డుల్లో ఒక రోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తున్నారు. అధికారులు వచ్చే సమయానికి సంబంధిత ధ్రువపత్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు.
(3 / 6)
రాష్ట్రవ్యాప్తంగా 80,54,554 దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్‌గా పెట్టారు. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా… అధికారులు పని చేస్తున్నారు. సర్వేలో అన్ని కలిపి 30 - 35 ప్రశ్నలు ఉంటున్నాయి.
(4 / 6)
నిజమైన అర్హులను గుర్తించటమే లక్ష్యంగా సర్వే కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న నివాసం, లేదా స్థలం వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందినవారిని పక్కనపెట్టేయనున్నారు. వారిని అనర్హులుగా గుర్తించనున్నారు. ప్రస్తుతం ఇల్లు ఎలా ఉంది…? కుటుంబ సభ్యుల వివరాలు, వారి వివాహ స్థితిగతులపై ఆరా తీసి ఎంట్రీ చేస్తున్నారు.
(5 / 6)
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారే ఈ పథకానికి అర్హులు అవుతారు.ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పూర్తిగా ఇల్లు లేకుండా… ఎలాంటి ఆధారం లేని వారిని తొలి విడతలోనే ఎంపిక చేస్తారు. సొంత జాగాలు ఉన్నవారికి ఈ దశలో ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇక ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు.
(6 / 6)
ఇక ఇళ్ల కోసం ప్రజాపాలన లో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇతర గ్యాలరీలు