Manchu Manoj Manchu Vishnu: నాన్న దగ్గర మనోజ్ స్లిప్ అయ్యాడు, ఒప్పుకోమని బతిమిలాడాడు.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్
Manchu Vishnu About Manchu Manoj And Mohan Babu: మంచు ఫ్యామిలీ కలహాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ గురించి మంచు విష్ణు చేసిన కామెంట్సి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచు విష్ణు మాట్లాడిన విషయంలోకి వెళితే..!
Manchu Vishnu About Manchu Manoj And Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబ కలహాలు హాట్ టాపిక్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబుపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.
పిటిషన్‌పై వాయిదా
హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో తన నివాసం వద్ద జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేశారని హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం విలేకరిని హాస్పిటల్‌కు వెళ్లి మోహన్ బాబు ఫ్యామిలీ పరామర్శించింది. ఈ కేసు విషయమై ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా కోర్టు నిరాకరించింది. అలాగే, ఈ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును డిసెంబర్ 23కు కోర్టు వాయిదా వేసినట్లు సమాచారం.
అయితే, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య కుటుంబ ఆస్తులకు సంబంధించి గొడవలు అవుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అన్నదమ్ముల గొడవను పరిష్కరించే క్రమంలో మోహన్ బాబు ఇలా కేసులతో సతమతం అవుతున్నారు. ఇదిలా ఉంటే, గతంలో మంచు మనోజ్, మంచు విష్ణు చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉండేవారని తెలిసిందే.
విరానికా పెళ్లి విషయంలో
అందుకు ఉదాహరణగా గతంలో మంచు మనోజ్ గురించి మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో తన భార్య విరానికా మంచును పెళ్లి చేసుకునేందుకు మోహన్ బాబును మంచు మనోజ్ ఒప్పించిన తీరును మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"నేను విరానిక ప్రేమించుకుంటున్నట్లు ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్‌లో వచ్చింది. ఎవరికీ తెలియని మా ఫ్యామిలీ విషయం మీడియా బయటపెట్టింది. ఆ విషయంలో నేను ఎప్పుడు క్షమించను. అది తెలిసి మా నాన్న కోప్పడ్డారు. ఏంటీ నన్ను మోసం చేయాలనుకుంటున్నారా అన్నారు. మా అమ్మకు మా విషయం తెలుసు. దాంతో అమ్మను బాగా తిట్టారు" అని మంచు విష్ణు చెప్పాడు.
నెల రోజుల గ్యాప్‌లో
"నాన్నను డీల్ చేసేంది మా బావాగారే. ఆయన మాట్లాడారు. తర్వాత నాన్నను ఒప్పించేందుకు బ్రహ్మానందం గారు వచ్చారు, దాసరి పద్మ గారు వచ్చారు. ఇలా చాలా మంది మాట్లాడారు. ఏంటీ పదమందితో చెప్పించాలని చూస్తున్నారా. నేను జోకర్‌లా కనిపిస్తున్నానా అని తిట్టారు. ఇదంతా ఒక నెల గ్యాప్‌లో జరుగుతుంది. ఓరోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక నాన్న దగ్గరికి మనోజ్, అమ్మ వెళ్లారు" అని మంచు విష్ణు తెలిపాడు.
"నాన్నతో మనోజ్ పడుకుని ఆయన గుండెలపై తలపెట్టి ఒప్పుకోవచ్చు కదా నాన్నా. వదినా చాలా మంచిది నాన్న.. విన్ని చాలా మంచిది అని వదిన అని టక్కున స్లిప్ అయిపోయాడు డాడీ ముందు. చాలా మంచిది. అన్నకు చాలా ఇష్టం. అన్నను బాగా చూసుకుంటుంది నాన్న అంటే.. ఆయన ఆల్రెడీ ఆలోచిస్తున్నారేమో.. సరే ఓసారి వాళ్ల ఇంట్లోవాళ్లను పిలవండి మాట్లాడుతాను అని అన్నారు" అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
నేను నమ్మలేకపోయాను
"అంతే వాళ్లు వచ్చారు. నాన్న ఒప్పుకున్నాడు అని చెప్పాడు. నేను నమ్మలేకపోయాను. ఏంటీ ఒప్పుకున్నాడు అన్నాను. నాన్న ఒప్పుకున్నాడు అని చెప్పాడు. సో ఇక ఇమీడియట్‌గా అమెరికాకు ఫోన్ చేసి వాళ్లను రమ్మని అంతా ఓకే అయింది" అని మంచు విష్ణు తెలిపాడు.
అయితే, ఇదే ఇంటర్వ్యూలో విరానికా గురించి తనకు మాత్రమే చెప్పలేదని మోహన్ బాబు కోపం చూపించారని మంచు విష్ణు అన్నాడు. ఇలా గతంలో తనకోసం మంచు మనోజ్ చేసింది చెప్పుకొచ్చిన మంచు విష్ణు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.