Getup Srinu: ఒకప్పుడు బ్రహ్మానందం చేశారు.. ఇప్పుడు గెటప్ శ్రీను.. హనుమాన్ హీరో తేజ సజ్జా కామెంట్స్-teja sajja comments on getup srinu brahmanandam in raju yadav trailer launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Getup Srinu: ఒకప్పుడు బ్రహ్మానందం చేశారు.. ఇప్పుడు గెటప్ శ్రీను.. హనుమాన్ హీరో తేజ సజ్జా కామెంట్స్

Getup Srinu: ఒకప్పుడు బ్రహ్మానందం చేశారు.. ఇప్పుడు గెటప్ శ్రీను.. హనుమాన్ హీరో తేజ సజ్జా కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 06, 2024 08:38 AM IST

Teja Sajja Getup Srinu Raju Yadav Trailer Launch: జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుపై హునుమాన్ హీరో తేజ సజ్జా ఆసక్తికర కామెంట్స్ చేశారు. గెటప్ శ్రీను హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాజు యాదవ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా తేజ సజ్జా వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు బ్రహ్మానందం చేశారు.. ఇప్పుడు గెటప్ శ్రీను.. హనుమాన్ హీరో తేజ సజ్జా కామెంట్స్
ఒకప్పుడు బ్రహ్మానందం చేశారు.. ఇప్పుడు గెటప్ శ్రీను.. హనుమాన్ హీరో తేజ సజ్జా కామెంట్స్

Teja Sajja About Getup Srinu: బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన రాజు యాదవ్ టీజర్‌, రాజు యాదవ్ చూడు, దిస్ ఈజ్ మై దరిద్రం పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజుయాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రాజు యాదవ్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సూపర్ హీరో తేజ సజ్జా ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా హనుమాన్ హీరో తేజ సజ్జా స్పీచ్ ఇచ్చారు. "శ్రీనుగారు జాంబిరెడ్డి చిత్రం నుంచి పరిచయం. తను విలక్షణమై నటుడు. జాంబిరెడ్డిలో కళ్లు మూసుకొని నటించారు. హనుమాన్‌లో పళ్ల సెట్ పెట్టుకొని నవ్వించారు. ఏదైనా ఒక సమస్య ఉంటే ఆయన అద్భుతంగా నటిస్తారు" అని తేజ సజ్జా అన్నారు.

"రాజు యాదవ్‌లో నవ్వుతూనే ఉండాలనే సమస్య ఉంది. కచ్చితంగా అదరగొట్టి ఉంటారు. ఇది చాలా మంచి కథ. ఒక అర్ధవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే అది పెద్ద సినిమా అవుతుంది. అర్ధవంతమైన ఎమోషన్స్‌తో మీనింగ్ ఫుల్ మూవీ ఇది. ఇలాంటి సినిమా చేసిన టీం అందరికీ అల్ ది బెస్ట్" అని తేజ సజ్జా తెలిపారు.

"శ్రీను గారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. సినిమా కోసం అహర్నిశలు కష్టపడతారు. పక్కన ఉన్న నటులని కూడా సపోర్ట్ చేస్తారు. కామెడీ చేయడం కష్టమైన పని. కామెడీ చేసే వాళ్లు ఏడిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో బ్రహ్మానందం గారు చేస్తే ఒక సారి చూశాం. ఈసారి గెటప్ శ్రీను చేయబోతున్నారు. ఇది నవ్విస్తూ మనసుని హత్తుకునే చిత్రం" అని తేజ సజ్జా చెప్పారు.

"రాజు యాదవ్ సినిమా మే 17న విడుదల అవుతోంది. ఇలాంటి మంచి సినిమాని తప్పకుండా అందరూ ప్రోత్సహించండి. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. హర్ష వర్ధన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో రాజు యాదవ్ పాటని చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకి గొప్ప పేరొచ్చి శ్రీను గారికి, సినిమా యూనిట్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అని తేజ సజ్జా చెప్పుకొచ్చారు.

కాగా తేజ సజ్జా, గెటప్ శ్రీను కలిసి రెండు సినిమాల్లో నటించారు. జాంబిరెడ్డిలో ఫ్యాక్షనిస్ట్‌గా గెటప్ శ్రీను యాక్టింగ్ అదిరిపోతుంది. ఒక కన్నుతో ఉన్న ఫ్యాక్షనిస్ట్‌గా అద్భుతమైన కామెడీ పండించాడు గెటప్ శ్రీను. అలాగే ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జకు ఫ్రెండ్ పాత్రలో గెటప్ శ్రీను అలరించాడు.

హనుమాన్ సినిమాలో గెటప్ శ్రీను కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. ఎత్తు పళ్లు పెట్టుకుని తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు గెటప్ శ్రీను. ఇక జబర్దస్త్ కామెడీ షోతో ప్రారంభమైన గెటప్ శ్రీని సినీ ప్రయాణం ఇప్పుడు హీరోగా మరొ కొత్త జర్నీ స్టార్ట్ అయింది.