Multibaggar stock : 5ఏళ్లల్లో 26000శాతం రిటర్నులు ఇచ్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​.. మీరు కొన్నారా?-multibaggar stock to buy mercury evtech share price gave 26000 returns all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibaggar Stock : 5ఏళ్లల్లో 26000శాతం రిటర్నులు ఇచ్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​.. మీరు కొన్నారా?

Multibaggar stock : 5ఏళ్లల్లో 26000శాతం రిటర్నులు ఇచ్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​.. మీరు కొన్నారా?

Sharath Chitturi HT Telugu
Dec 21, 2024 01:40 PM IST

Stocks to buy : మెర్క్యురీ ఎవ్-టెక్ లిమిటెడ్ స్మాల్ క్యాప్ స్టాక్ కంపెనీ షేర్లకు 5ఏళ్లల్లో బంపర్​ రిటర్నులు ఇచ్చాయి. ఏకంగా దాదాపు 26000శాతం వృద్ధిచెందాయి.

5ఏళ్లల్లో 26000శాతం రిటర్నులు
5ఏళ్లల్లో 26000శాతం రిటర్నులు

స్టాక్​ మార్కెట్​లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అనేక స్టాక్స్​ పతనమవుతున్నాయి. కానీ ఈ సమయంలోనూ కొన్ని స్టాక్స్​ అప్పర్​ సర్క్యూట్స్​ కొడుతున్నాయి. వాటిల్లో ఒకటి మెర్క్యూరీ ఎవ్​-టెక్​ లిమిటెడ్​ స్టాక్​! శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ కంపెనీ షేర్లకు 5 శాతం అప్పర్ సర్క్యూట్​ని తాకాయి. అనంతరం అప్పర్ సర్క్యూట్ తర్వాత కంపెనీ షేరు ధర బీఎస్ఈలో రూ.90.48 స్థాయికి చేరుకుంది.

మెర్క్యురీ ఈవీ టెక్ షేరు ధర 2019లో కేవలం 30 పైసలు మాత్రమే! అప్పటి నుంచి కంపెనీ షేర్లు దాదాపు 26,000శాతం పెరిగాయి. అంటే ఇదొక మల్టీబ్యాగర్​ స్టాక్​! బీఎస్​ఈలో కంపెనీ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.139.20గా ఉంది. 52 వారాల కనిష్టం రూ.64.32గా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1570 కోట్లు.

ఈ స్టాక్​ ఎందుకు వార్తల్లో ఉంది?

ఈ కంపెనీ ప్రస్తుతం 2 వీలర్​​, 3 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల్లోని కీలక భాగాలను తయారు చేస్తోంది. ఇక ఇప్పుడు కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని డిసెంబర్ 17న స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్​లో మెర్క్యూరీ ఈవీ-టెక్​ కంపెనీ తెలిపింది. ఈ కొత్త అనుబంధ సంస్థ పేరు గ్లోబల్ కంటైనర్ ప్రైవేట్ లిమిటెడ్. కంటైనర్లను తయారు చేయడం, దానికి సంబంధించిన పనులు చేయడం ఈ సంస్థ పని.

ఈ మల్టీబ్యాగర్ స్టాక్ శుక్రవారం అప్పర్ సర్క్యూట్ టచ్​ అయ్యి అనంతరం రూ. 88.11 వద్ద క్లోజ్​ అయ్యింది. ఈ మెర్క్యురీ ఈవీ టెక్ లిమిటెడ్ షేరు ధర గత ఏడాది కాలంలో 26 శాతానికి పైగా పడిపోయింది. గత నెల రోజుల్లో ఈ స్మాల్​క్యాప్ స్టాక్ 11 శాతానికి పైగా పతనమైంది. కానీ 5ఏళ్లల్లో ఏకంగా 25,800శాతం వరకు వృద్ధిచెందింది.

టాటా మోటార్స్​ షేర్లు ఉన్నాయా..?

టాటా మోటార్స్​ షేర్లు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదొడుకులకు లోనై, భారీగా పతనమయ్యాయి. ఆ కంపెనీ షేరు దాదాపు ‘52 వీక్​ లో’ దగ్గర ఉంది. మరి టాటా మోటార్స్​ షేర్లు పెరుగుతాయా? ఇంకా పడతాయా? షేర్లను అమ్మేయాలా?

టాటా మోటార్స్ షేరుకు 'బై' రేటింగ్ ఇచ్చింది బ్రోకరేజీ సంస్థ ఎల్​కేపీ సెక్యూరిటీస్. ద్వితీయార్థంలో దేశీయ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ పెరగవచ్చని, ఇటీవల లాంచ్​లు సైతం ఇందుకు మద్దతు ఇస్తాయని బ్రోకరేజీ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ .970 అని ప్రకటించింది. ఇది ప్రస్తుత ధర కంటే దాదాపు 30 శాతం ఎక్కువ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

(గమనిక:- ఇది నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. స్టాక్​లో ఇన్వెస్ట్​మెంట్​కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం