YouTube new rules : భారత్‌లో యూట్యూబ్ కొత్త రూల్స్- ఇలా చేస్తే ఇక మీ వీడియో డౌన్..
YouTube new rules : ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్‌కి అలర్ట్! యూట్యూబ్ మరింత కఠినమైన రూల్స్‌ని తీసుకొచ్చింది. తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే మీ వీడియోని యూట్యూబ్ తొలగించే ప్రమాదం కూడా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వీక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉండే ‘క్లిక్‌బైట్’ వీడియోలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు యూట్యూబ్ ప్రకటించంది. తప్పుదోవ పట్టించే విధంగా ఉండే హెడ్‌లైన్స్, థంబ్‌నెయిల్స్‌తో కూడిన వీడియోలను తొలగిస్తామని భారతీయ కంటెంట్ క్రియేటర్స్ని హెచ్చరించింది. ఈ మేరకు కఠినమైన నిబంధనలను అమలు చేసే ప్రణాళికలను ప్రకటించింది.
బ్రేకింగ్ న్యూస్, కరెంట్ ఈవెంట్స్‌పై ప్రభావం
"విపరీతమైన క్లిక్‌బైట్" కలిగి ఉన్న వీడియోలను తొలగిస్తామని ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని యూట్యూబ్ డిసెంబర్ 18న ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇటువంటి క్లిక్‌బైట్ వీక్షకులను తప్పుదోవ పట్టిస్తుందని, వారు మోసపోతారని, నిరాశ చెందుతారని యూట్యూబ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. బ్రేకింగ్ న్యూస్, కరెంట్ ఈవెంట్‌కి సంబంధించిన కంటెంట్‌ని నిశితంగా పరిశీలిస్తామని యూట్యూబ్ పేర్కొంది.
ఉదాహరణకు, "ది ప్రెసిడెంట్ రాజీనామా" లేదా "బ్రేకింగ్ పొలిటికల్ న్యూస్" వంటి శీర్షికలతో ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్స్‌తో జతచేసిన వీడియోలు ఇప్పుడు ఆ వాగ్దానాలను నెరవేర్చకపోతే యూట్యూబ్ లేటెస్ట్ రూల్స్‌ని ఉల్లంఘించినట్టే!
కంటెంట్ క్రియేటర్ల కోసం విద్యా కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా క్లిక్బైట్ని ఎదుర్కోవడానికి యూట్యూబ్ గతంలో చేసిన ప్రయత్నాలను అనుసరించి ఈ చర్య తీసుకుంది. అయితే తప్పుదోవ పట్టించే శీర్షికలు, థంబ్‌నెయిల్స్ ఉన్న వీడియోలను కేవలం ఫ్లాగ్ చేయడం లేదా రద్దు చేయడం కాకుండా పూర్తిగా తొలగిస్తామని తాజా విధాన మార్పులు స్పష్టం చేస్తున్నాయి.
క్రియేటర్స్ జాగ్రత్త.!
తొలుత యూట్యూబ్ మోసపూరిత శీర్షికలు లేదా థంబ్‌నెయిల్స్ ఉన్న వీడియోలను తొలగిస్తుంది కానీ క్రియేటర్ల ఛానళ్లకు స్ట్రైక్స్ జారీ చేయదు. ఈ విధానం సృష్టికర్తలకు తక్షణ శిక్షలు లేకుండా వారి పద్ధతులను సర్దుబాటు చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. అయితే బ్రేకింగ్ న్యూస్ లేదా కరెంట్ ఈవెంట్లను ఎలా నిర్వచిస్తారో కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. లేదా విపరీతమైన క్లిక్బైట్ని ఉపయోగించే వీడియోలను ఎలా గుర్తిస్తుందో పేర్కొనలేదు. అంతేకాకుండా క్రియేటర్లు తమ వీడియోలను తొలగించడంపై ఎలా అప్పీల్ చేయవచ్చనే వివరాలను యూట్యూబ్ ఇంకా చెప్పలేదు.
లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోలపై యూట్యూబ్ దృష్టి పెడుతుంది. అయితే కొత్త నిబంధనలను ఉల్లంఘించే పాత కంటెంట్ సైతం పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. క్రియేటర్లు వారి మునుపటి అప్లోడ్లను సమీక్షించమని, నవీకరించిన విధానాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. "విపరీతమైన క్లిక్‌బైట్" అంటే ఏంటి? దానిని ఎలా నివారించాలో అర్థం చేసుకోవడానికి యూట్యూబ్ క్రియేటర్స్‌కి సహాయపడటానికి వనరులను అందించాలని ప్లాట్‌ఫామ్ యోచిస్తోంది.
వీక్షకులకు, ఈ మార్పు తప్పుదోవ పట్టించే కంటెంట్‌తో నిరాశను తగ్గించడం ద్వారా వారి అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. మోసపూరిత వ్యూహాలను ఛేదించడం ద్వారా, ఖచ్చితమైన, సంబంధిత కంటెంట్‌ని అందించడానికి వీక్షకులు వారు చూసే వీడియోలపై ఆధారపడే మరింత నమ్మదగిన వాతావరణాన్ని పెంపొందించాలని యూట్యూబ్ భావిస్తోంది. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రావడంతో, భారతీయ క్రియేటర్లు ఎలా స్పందిస్తారో, ఈ ప్రమాణాలకు అనుగుణంగా వారి కంటెంట్‌ని ఎలా సర్దుబాటు చేస్తారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.
సంబంధిత కథనం