Andhra Pradesh News Live December 21, 2024: Notices To RGV : ఆర్జీవీకి మరో షాకిచ్చిన ఏపీ సర్కార్, ఫైబర్ నెట్ నిధుల మళ్లింపుపై నోటీసులు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 21 Dec 202404:23 PM IST
Notices To RGV : దర్శకుడు ఆర్జీవీకి ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్జీవీ, వ్యూహం చిత్ర యూనిట్ నగదు చెల్లించారని ఏపీ సర్కార్ తెలిపింది. ఈ నేపథ్యంలో 15 రోజుల్లో 12 శాతం వడ్డీతో ఈ డబ్బు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
Sat, 21 Dec 202401:38 PM IST
AP Weather Updates : బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
Sat, 21 Dec 202412:11 PM IST
- Pawan Kalyan : అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంజాయి పూర్తిగా వదిలేవరకు గిరిజనులను వదలబోనని స్పష్టం చేశారు. సినిమాల కోసం ఎప్పుడూ కలలు కనలేదని చెప్పారు.
Sat, 21 Dec 202410:47 AM IST
Minister Atchannaidu : ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల డబ్బులు చెల్లిస్తున్నామన్నారు.
Sat, 21 Dec 202409:22 AM IST
Trains Diverted : ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 8 రైళ్లను దారి మళ్లించింది. రైళ్లను గుంటూరు-పగిడిపల్లి మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి. అలాగే పలు రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
Sat, 21 Dec 202409:09 AM IST
Tribal People Doli Troubles : ఉత్తారంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు లేని వందల గ్రామాలు ఉన్నాయి. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ప్రాణాలు దక్కాలంటే పదుల కిలోమీటర్లు డోలీల్లో ప్రయాణించాల్సిందే.
Sat, 21 Dec 202407:26 AM IST
- AP Free Bus Scheme : మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు.. కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Sat, 21 Dec 202405:47 AM IST
- ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు.
Sat, 21 Dec 202404:40 AM IST
- Vijayawada : ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్షల విరమణ నేటీ నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 వరకు విరమణ కార్యక్రమం జరుగుతోంది. దీంతో వేలల్లో భక్తులు వస్తారని దేవస్థానం అంచనా వేసింది. చివరి రెండు రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచానా వేసింది.
Sat, 21 Dec 202404:40 AM IST
- YS Jagan Birthday: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి. ఆయనకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖలు విషెస్ చెబుతున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
Sat, 21 Dec 202403:30 AM IST
- వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తనే భార్య హత్య చేయించింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన కడప జిల్లాలోని కొండాపురం మండల పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. భార్యతో పాటు హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేశారు.
Sat, 21 Dec 202401:39 AM IST
- Road Accident in Sri Sathya Sai district: శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిర మండలంలో తెల్లవారుజామున ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
Sat, 21 Dec 202411:51 PM IST
- బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తదుపరి 24 గంటలలో ఈ వాయుగుండం తీవ్రతను కొనసాగిస్తుందని వాతావరణశాఖ పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఇక తెలంగాణలో డిసెంబర్ 24 నుంచి వానలు కురిసే అవకాశం ఉంది.