YS Jagan Birthday : వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు - సీఎం చంద్రబాబు ట్వీట్, ఏం చెప్పారంటే-ap cm chandrababu naidu wishes ys jaganmohan reddy on birthday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Birthday : వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు - సీఎం చంద్రబాబు ట్వీట్, ఏం చెప్పారంటే

YS Jagan Birthday : వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు - సీఎం చంద్రబాబు ట్వీట్, ఏం చెప్పారంటే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 21, 2024 10:37 AM IST

YS Jagan Birthday: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి. ఆయనకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖలు విషెస్ చెబుతున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

వైఎస్ జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం చంద్రబాబు
వైఎస్ జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన కేక్ లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గవర్నర్, సీఎం చంద్రబాబు ట్వీట్….

వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్‌ నజీర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు." దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలి.ప్రజా సేవలోసుదీర్ఘ కాలం ఉండాలని" ఆకాంక్షించారు.

మరోవైపు జగన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే గ్రీటింగ్స్ టూ వైఎస్ జగన్ గారూ' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు పొందాలని ఆకాంక్షించారు. అయితే గతేడాది కూడా జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

మరోవైపు రాష్ట్రంలోని పట్టణాలు, జిల్లా, మండల కేంద్రాల్లో వైసీపీ నేతలు జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల రక్తదాన శిబిరాలు, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. ఇదేగాక జగన్ కు శుభాకాంక్షలు తెలిపేలా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలోనూ హోరెత్తిస్తున్నారు.#HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్ తో తెగ పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెడింగ్ లో ఉంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు రామేశ్వరంలోని  శ్రీ హనుమత్ లింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. 

ఇక ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ శ్రేణులతో కలిసి దేవినేని అవినాష్ కేక్ కట్ చేశారు. "ఆటు పోట్లను అవలీలగా ఎదుర్కోగల "ధీరుడికి" జన్మదిన శుభాకాంక్షలు" అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. మాజీ మంత్రి రోజా కూడా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 

Whats_app_banner