Thermal Wear Buying Tips: థర్మల్ వేర్ కొనే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి, ఉతికే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి
Thermal Wear Buying Tips: చలికాలం వచ్చిందంటే సాధారణ దుస్తులతో పాటు చలికోట్లు కచ్చితంగా ధరించాలి. కొన్నిసార్లు చలికోట్లు వంటివి ధరించకపోయినా థర్మల్ వేర్ (వెచ్చగా ఉంచేవి) వాడి శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవచ్చు. ఈ థర్మల్ వేర్ కొనుగోలు చేసే సమయంలో పొరబాట్లు జరగకుండా ఉండాలంటే ఈవిషయాలను గుర్తుంచుకోండి.
వాతావరణం మారుతున్నప్పుడు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు థర్మల్ దుస్తులకు ప్రాధాన్యత ఇస్తుంటాం. శరీర వేడిని కాపాడుతూ లోపలికి చల్లదనాన్ని పోనీయకుండా కాపాడతాయి. ఉన్నితో తయారుచేసే చలికోట్ల మాదిరిగానే పని చేస్తాయి. కానీ, బరువుపరంగా ఇవి కాస్త తేలికగా, సౌకర్యవంతంగా కనిపిస్తాయి. అందుకే వీటికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు. కాకపోతే వీటిని కొనుగోలు చేసే సమయంలో మన కామన్ గా చేసే పొరబాట్లు, కొనేసిన తర్వాత రియలైజ్ అయినా కూడా సరిదిద్దుకోలేం. అందుకే కొనడాని కంటే ముందే ఈ విషయాలు తెలుసుకోండి. జలుబుతో పాటు వాతావరణ మార్పు వల్ల వచ్చే సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
ఏ ప్రాంతంలో వారికి ఏవి సూట్ అవుతాయంటే..
కొండలు, గట్ల మధ్య ఉండేవారికి మిగతా వాతావరణంతో పోలిస్తే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీరు థర్మల్ దుస్తులను కొనుగోలు చేయాలనుకుంటే, మిశ్రమ ఉన్నితో కలిగి ఉన్న థర్మల్ దుస్తులను కొనుగోలు చేయండి. ఇలాంటి దుస్తులు శరీరానికి మరింత వెచ్చదనాన్ని ఇస్తాయి. కాటన్ ఫ్యాబ్రిక్ తో థర్మల్ వేర్ తేలికపాటి చలికి మంచిది. మరీ వేడిగా ఉండదు. పాలిస్టర్, స్పాండెక్స్ తో కలిపిన థర్మల్ వేర్ తేలికైనది, సరళమైనది. ఇది తేమను గ్రహించడంలో సహాయపడుతుంది.
సైజ్ విషయంలో జాగ్రత్త
థర్మల్ వేర్ కొనుగోలు చేసేటప్పుడు, దాని సైజ్ కూడా గుర్తుంచుకోండి. మామూలు దుస్తుల మాదిరిగా శరీరానికి సరిపడా లేదా టైట్ గా ఉండేవి తీసుకోకూడదు. అలాగే చాలా వదులుగా ఉండేవి కూడా తీసుకోకూడదు. మధ్యస్తంగా ఉండే వాటిని మాత్రమే ఎంచుకోండి. ఒకవేళ టైట్ గా ఉండేవి తీసుకుంటే రక్తప్రసరణ నెమ్మెది అవుతుంది. లూజ్ గా ఉన్నవి తీసుకుంటే శరీరానికి చలి నుంచి రక్షణ దొరకదు.
బరువుంటే ఇబ్బందే
ఇంకొక విషయమేమిటంటే, చాలా మంది భావించినట్లు థర్మల్ వేర్ బాగా మందంగా ఉంటే బాగుంటుందనేది పూర్తిగా వాస్తవం కాదు. థర్మల్ వేర్ బాగా మందంగా ఉంటే అది కచ్చితంగా ఎక్కువ బరువుతో ఉంటుంది. ఫలితంగా ధరించేందుకు అసౌకర్యంగా అనిపిస్తుంది. దీనికి విరుద్ధంగా, తేలికపాటి బరువుతో ఉన్న లేదా సన్నని థర్మల్ దుస్తులు ఎంచుకోవడం ఎల్లప్పుడూ మంచి ఎంపిక. ఇటువంటి థర్మల్ దుస్తులను ఇతర దుస్తుల కింద సులభంగా ధరించవచ్చు.
వీటిని ఉతికే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే:
- థర్మల్ దుస్తులను ఎల్లప్పుడూ లిక్విడ్ డిటర్జెంట్ తో కడగాలి.
- ఉతికిన దుస్తులను నేరుగా సూర్యుని వెలుతురు పడేలా ఆరబెట్టకూడదు. అలా చేయడం దుస్తుల మధ్యలో ఖాళీలు వదులుగా మారిపోతాయి.
- కొన్నింటికి ప్రత్యేకమైన పద్దతిలో ఉతకాలని వాటిపై ఉన్న లేబుల్స్ లో రాసి ఉంచుతారు. వాటిని అనుసరించి మాత్రమే థర్మల్ దుస్తులను ఉతకాలి.
- అలాగే ఈ దుస్తులను ఉతికే సమయంలో బ్రష్ ఎక్కువ సేపు చేయకూడదు. అలా చేయడం వల్ల వాటిపై ఉన్న రంగు పోయి కొంతకాలానికే పాతవాటిలా కనిపిస్తాయి. -
- సాధ్యమైనంత వరకు థర్మల్ దుస్తులను చేతులతో ఉతకడం ఉత్తమం. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో మైల్డ్ డిటర్జెంట్ వేసి ఉతుక్కోవాలి. ఉతికేసిన తర్వాత కచ్చితంగా థర్మల్ వేర్ నుండి డిటర్జెంట్ పూర్తి మొత్తంలో తొలగిపోవాలి.
- ఒకవేళ మెషీన్ లో వేసి వాష్ చేయాల్సి వస్తే వాటిని పూర్తిగా నీరు పోయేంతవరకూ ఉంచొద్దు. అలా చేస్తే అదే థర్మల్ వేర్ ను తీగల మీద ఆరబెట్టినప్పుడు ఆ వస్త్రం దాదాపు సాగిపోయే గుణంతో ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్