Fashion: అబ్బాయిలు.. పింక్ కలర్ దుస్తులు వేసుకునేందుకు జంకుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Fashion: సాధారణంగా పింక్ కలర్ షేడ్ ఉన్న దుస్తులను ధరించేందుకు చాలా మంది అబ్బాయిలు జంకుతుంటారు. ఎవరు ఏమనుకుంటారో.. డిఫరెంట్‍గా ఉంటుందేమోనని అనుకుంటుంటారు. అలాంటి వారు ఈ విషయాలు చూడండి.
ఫ్యాషన్ విషయంలో కొన్ని అభిప్రాయాలు బలంగా నాటుకొని ఉంటాయి. ముఖ్యంగా కలర్ల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇందులో ‘పింక్’ గురించి ఓ మాట బలంగా వినిపిస్తుంటుంది. అదే పింక్ కలర్ అమ్మాయిలకు మాత్రమే అని అనుకుంటుంటారు. పింక్ కలర్ షేడ్‍లో ఉన్న డ్రెస్‍లు వారి మాత్రమే సూటవుతాయని భావిస్తారు. చాలా మంది అబ్బాయిలు.. పింక్ కలర్ వేసుకునేందుకు వెనకడుగు వేస్తారు. ఆ కలర్ దుస్తులు ధరించాలని ఉన్నా జంకుతారు. అలాంటి వారు ఈ విషయాలను తెలుసుకోండి.
ఛాలెంజ్ చేసినట్టు..
పింక్ కలర్ దుస్తులు అమ్మాయిలకే సూటవుతాయనే పాతకాలపు అపోహ ఇంకా బలంగా ఉంది. అయితే, పింక్ దుస్తులు ధరిస్తే ఆ అపోహను ఛాలెంజ్ చేసినట్టుగా అవుతుంది. ఈ కలర్ వేసుకున్నప్పుడు ఎవరైనా ప్రశంసిస్తే ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. కొత్తదనాన్ని ప్రయత్నించి.. విజయం సాధించిన ఫీలింగ్ కలుగుతుంది. కొందరు బలంగా నమ్మే వాటిని సవాలు చేసినట్టు అవుతుంది. అయితే, అబ్బాయిలకు లైట్ పింక్ కలర్ బాగా కనిపిస్తుంది.
చాలా కలర్లపై సూటవుతుంది
లైట్ పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే.. చాలా కలర్ల ప్యాంట్‍లు దానికి సూటవుతాయి. ముఖ్యంగా లైట్ పింక్ షేడ్ ఉన్న చొక్కాపై చాలా కలర్ల ప్యాంట్‍లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వైట్, బ్లూ, బ్లాక్, గ్రే కలర్ షేడ్ల ప్యాంట్ ధరించవచ్చు. లైట్ పింక్ ప్యాంట్ ధరించినా.. షర్టుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.
ప్రత్యేకంగా కనిపిస్తారు
పింక్ కలర్ షేడ్ ఉన్నవి ధరిస్తే మిగిలిన వారితో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇప్పటికీ అబ్బాయిల్లో ఎక్కువ మంది ఈ కలర్ వాడడం లేదు. అందుకే పింక్ కలర్ ధరిస్తే స్టాండ్‍ఔట్ అవుతారు. ముఖ్యంగా పార్టీలకు, ఫంక్షన్లకు ఈ షేడ్ ట్రై చేస్తే అట్రాక్టివ్‍గా ఉంటారు.
రొమాంటిక్ లుక్ ఇస్తుంది
లైట్ పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే అబ్బాయిల లుక్ చాలా కూల్‍గా, రొమాంటిక్‍గా ఉంటుంది. అబ్బాయిలు ఈ కలర్ షేడ్ వేసుకోవడం చాలా మంది అమ్మాయిలకు కూడా నచ్చుతుంది. ముఖ్యంగా డేట్‍కు వెళ్లే టైమ్‍లో లైట్ పింక్ కలర్, వైట్ ప్యాంట్ ధరిస్తే ఆ లుక్ మరో రేంజ్‍లో ఉంటుంది.
అన్ని స్కీన్ టోన్‍లకు..
లైట్ పింక్ కలర్ ఏ స్కిన్ టోన్‍కైనా బాగా కనిపిస్తుంది. చర్మపు రంగు ఎలా ఉన్న వారైనా ఔట్‍ఫిట్‍లో ఈ కలర్ బాగా సూటవుతుంది. అయితే, తమ రంగుకు తగ్గట్టుగా పింక్‍లో షేడ్‍ను సరిగా ఎంపిక చేసుకోవాలి. షర్టులు, ప్యాంట్‍లే కాకుండా లైట్ కలర్ సూట్లు కూడా అఫీషియల్‍గా డిఫరెంట్ లుక్ ఇస్తాయి.
టాపిక్