Credit Card tips : క్రెడిట్​ కార్డుతో అప్పుల ఊబిలో పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..-credit card debt 6 key tips to stay debtfree ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Credit Card Tips : క్రెడిట్​ కార్డుతో అప్పుల ఊబిలో పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Credit Card tips : క్రెడిట్​ కార్డుతో అప్పుల ఊబిలో పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Sharath Chitturi HT Telugu
Dec 02, 2024 08:20 PM IST

Credit card debt : క్రెడిట్​ కార్డులు ఎక్కువగా వాడేసి అప్పుల ఊబిలో కూరుకుపోయే ముందే మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అప్పుడే మీపై ఎలాంటి ఆర్థిక భారం పడదు.

క్రెడిట్​ కార్డులో అప్పుల ఊబిలో పడకండి..
క్రెడిట్​ కార్డులో అప్పుల ఊబిలో పడకండి..

క్రెడిట్​ కార్డులను సరిగ్గా వాడకపోతే మనం అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంటుంది. ఇది మనపై ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే, క్రెడిట్​ కార్డు ఎలా వాడాలో తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా క్రెడిట్​ కార్డు వల్ల అప్పుల ఊబిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి..

క్రెడిట్ కార్డ్ బకాయిలను అర్థం చేసుకోండి..

క్రెడిట్ కార్డుపై మీరు చెల్లించాల్సిన మొత్తం..

  • వడ్డీ: బకాయి ఉన్న మొత్తంపై ఛార్జీలు.
  • ఫీజు: వార్షిక రుసుము, ఆలస్య చెల్లింపు రుసుము, ఇతర ఛార్జీలు.
  • ఆలస్య చెల్లింపులు: ఇది మీ క్రెడిట్ స్కోరును తగ్గించడమే కాకుండా, పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా చట్టపరమైన పరిణామాలకు కూడా దారితీస్తుంది.

అప్పుల ఊబిలో పడకూడదంటే..

1. క్రెడిట్ కార్డులను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి: మీ బడ్జెట్​కి సరిపోయే, తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ ఫీజులు ఉన్న క్రెడిట్ కార్డులను ఎంచుకోండి. మీరు క్రెడిట్​ కార్డులకు కొత్తవారైతే లేదా మీరు అధికంగా ఖర్చు చేయడానికి మొగ్గు చూపితే, సురక్షితమైన క్రెడిట్ కార్డు లేదా తక్కువ పరిమితితో ప్రారంభించండి.

2. బడ్జెట్: మీ ఆదాయం, ఖర్చులకు అనుగుణంగా ఒక బడ్జెట్​ని ఏర్పాటు చేయండి. వృధా ఖర్చులను తగ్గించండి. పొదుపు, అవసరాలు, రుణ చెల్లింపుల కోసం డబ్బును మీ పరిమితిలో ఉంచడానికి కేటాయించండి.

3. మంచి ఆర్థిక అలవాట్లను ఏర్పరచుకోండి: అవసరాలు, ఆకస్మిక కొనుగోళ్లను నిరోధించాలనుకుంటే, ముందు వాటి మధ్య తేడాను గుర్తించగలగాలి. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం మానుకోండి. డబ్బులను సేవ్​ చేయండి.

4. ఎమర్జెన్సీ ఫండ్​: జీవితంలో అనిశ్చితుల వల్ల ఏర్పడే ఊహించని ఖర్చులు క్రెడిట్ కార్డుల వాడకాన్ని ప్రోత్సహిస్తాయి. అలా కాకుండా, మూడు నుంచి ఆరు నెలల జీవన ఖర్చులను ప్రత్యేక, సులభంగా యాక్సెస్ చేయగల ఖాతాలో సేవ్ చేయండి. క్రెడిట్​ కార్డు వాడరు.

5. మినిమమ్​ రీపేమెంట్​ కన్నా ఎక్కువ చెల్లించండి : గడువు తేదీలోగా మీ పూర్తి క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించడం మంచిది. అయితే కనీస బకాయి కంటే ఎక్కువ చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకోండి. అదనపు చెల్లింపులు చేయడం వల్ల అసలు మొత్తం వేగంగా తగ్గుతుంది. రోజువారీ వడ్డీ ఛార్జీలు తగ్గుతాయి. ఇది తిరిగి చెల్లించే వ్యవధిని తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో మీకు డబ్బును ఆదా చేస్తుంది.

6. ఈఎంఐ ఫ్రెండ్లీ: మీరు పూర్తి మొత్తాన్ని చెల్లించలేకపోతే మీ రుణాన్ని ఈఎంఐలుగా మార్చుకోమని మీ బ్యాంకును అడగండి. ఉదాహరణకు, కొన్నిసార్లు ఈఎంఐలకు వడ్డీ రేట్లు రివాల్వింగ్ క్రెడిట్ కంటే తక్కువగా ఉంటాయి. మీరు తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చుయ కానీ మీ క్రెడిట్ కార్డుపై తీసుకున్న డబ్బును చెల్లించండి.

Whats_app_banner

సంబంధిత కథనం