Affordable SUV : ప్రీమియం లుక్స్​, ఫీచర్స్​తో అఫార్డిబుల్​ ఎస్​యూవీ- స్కోడా కైలాక్​ ఫుల్​ ప్రైజ్​ లిస్ట్​..-affordable skoda kylaq suv full price list revealed check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Affordable Suv : ప్రీమియం లుక్స్​, ఫీచర్స్​తో అఫార్డిబుల్​ ఎస్​యూవీ- స్కోడా కైలాక్​ ఫుల్​ ప్రైజ్​ లిస్ట్​..

Affordable SUV : ప్రీమియం లుక్స్​, ఫీచర్స్​తో అఫార్డిబుల్​ ఎస్​యూవీ- స్కోడా కైలాక్​ ఫుల్​ ప్రైజ్​ లిస్ట్​..

Sharath Chitturi HT Telugu
Dec 02, 2024 04:44 PM IST

Skoda Kylaq price : స్కోడా కైలాక్​ ఫుల్​ ప్రైజ్​ లిస్ట్​ని సంస్థ రివీల్​ చేసింది. ఈ కైలాక్​ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో అఫార్డిబుల్​ ఎస్​యూవీగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అఫార్డిబుల్​ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ స్కోడా కైలాక్​..
అఫార్డిబుల్​ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ స్కోడా కైలాక్​..

భారత మిడిల్​ క్లాస్​ ప్రజల కోసం మరో అఫార్డిబుల్ సబ్​- కాంపాక్ట్​​ ఎస్​యూవీ అందుబాటులోకి వచ్చింది! అదే.. స్కోడా కైలాక్​ ఎస్​యూవీ. ఈ మోడల్​ ప్రారంభ ధరను రూ. 7.8లక్షలుగా (ఎక్స్​షోరూం) ఇప్పటికే ప్రకటించిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఇప్పుడు, ఫుల్​ ప్రైజ్​ లిస్ట్​ని రివీల్​ చేసింది. ఫలితంగా.. హై డిమాండ్​ ఉన్న ఎస్​యూవీ సెగ్మెంట్​లో అఫార్డిబుల్​ మోడల్స్​లో ఒకటిగా ఈ స్కోడా కైలాక్​ నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ధరలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్కోడా కైలాక్​ ఎస్​యూవీ ధరలు..

టాప్ స్పెక్ స్కోడా కైలాక్ ప్రెస్టీజ్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ వేరియంట్ ఎక్స్​షోరూమ్ ధర రూ .14.40 లక్షలు. మాన్యువల్ ట్రాన్స్​మిషన్ వెర్షన్ ఎక్స్​షోరూం ధర రూ .13.35 లక్షలు.

స్కోడా కైలాక్​ ధరలు
వేరియంట్లుమాన్యువల్​ఆటోమెటిక్​
Classic 7.79 lakh 
Signature 9.59 10.59
Signature Plus 11.40 12.40
Prestige 13.35 14.40

మిడ్ స్పెక్ సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ ఎక్స్​షోరూం ధరలు మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్ రూ.9.59 లక్షలు, రూ.11.40 లక్షలు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఎక్స్​షోరూం ధరలు రూ.10.59 లక్షలు, రూ.12.40 లక్షలుగా ఉన్నాయి.

స్కోడా కైలాక్​ ఎస్​యూవీ బుకింగ్స్​ డిసెంబర్ 2 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి. మొదటి 33,333 మంది కొనుగోలుదారులకు 3 సంవత్సరాల పాటు ఉచిత మెయింటెనెన్స్ కూడా లభిస్తుంది! స్కోడా కైలాక్ డెలివరీలు జనవరి 27, 2025న ప్రారంభమవుతాయి.

స్కోడా కైలాక్ డిజైన్​..

మారుతీ సుజుకీ బ్రెజా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూలకు పోటీగా ఈ కైలాక్​ ఎస్​యూవీ ఉంటుంది. స్కోడా కైలాక్ మోడ్రన్-సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్​ని పొందుతుంది. ఇది స్ల్పిట్​ హెడ్ ల్యాంప్స్, బాక్సీ సిల్హౌట్, కాంపాక్ట్ ఓవర్ హాంగ్​లను కలిగి ఉంది. సిగ్నేచర్ బటర్​ఫ్లై గ్రిల్ కొత్త కాంటెంపరరీ డిజైన్​ని పొందుతుంది. 17 ఇంచ్​ అల్లాయ్ వీల్స్ హై వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఎల్ఈడీ డీఆర్ఎల్స్​, హెడ్​ల్యాంప్స్ అన్ని వేరియంట్లలో వస్తుంది.

స్కోడా కైలాక్: ఫీచర్లు- ఇంజిన్​..

స్కోడా కైలాక్ 1.0 లీటర్ 3 సిలిండర్​ టీఎస్ఐ పెట్రోల్ యూనిట్​తో పనిచేస్తుంది. ఈ ఎస్​యూవీలో డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్​తో వస్తుంది. ఇది వైర్​లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లు టాప్​ 2 ట్రిమ్ స్థాయిలతో మాత్రమే అందుబాటులో ఉండగా, మిడ్ స్పెక్ సిగ్నేచర్ వేరియంట్ 5 ఇంచ్​ టచ్​స్క్రీన్​, సెమీ-డిజిటల్ ఇన్​స్ట్రు మెంట్ ప్యానెల్​ని పొందుతుంది. బేస్ క్లాసిక్ వేరియంట్ అనలాగ్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్​ని పొందుతుంది.

కైలాక్ ప్రెస్టీజ్​లో వెంటిలేషన్​తో కూడిన 6-వే పవర్ అడ్జెస్టెబుల్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. ఆసక్తికరంగా, ప్రతి వేరియంట్ సింగిల్ లేదా డ్యూయల్ టోన్​లో ప్రత్యేకమైన క్యాబిన్ అప్​హోలిస్ట్రీని పొందుతుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ + మోడళ్లకు ఫాబ్రిక్ అప్​హోలిస్ట్రీ ఒక స్టాండర్డ్​ సెటప్​! ఎలక్ట్రిక్ సన్​రూఫ్​తో పాటు ప్రెస్టీజ్ ఆల్ లెదర్-అప్ హోల్​స్ట్రీగా ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్ల పరంగా, ఈ ఎస్​యూవీ 25కి పైగా యాక్టివ్, పాసివ్ ఫీచర్లను పొందుతుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, మల్టీ కొలిషన్ బ్రేకింగ్, రోల్ఓవర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం