Ayurveda: ఈ ఆయుర్వేద మూలిక గురించి తెలుసా? జలుబు, దగ్గు తగ్గించడం సహా చాలా ప్రయోజనాలు, ఎలా వాడాలంటే..-ayurveda melethi benefits it can give relief from cold cough in winter athimadhuram ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ayurveda: ఈ ఆయుర్వేద మూలిక గురించి తెలుసా? జలుబు, దగ్గు తగ్గించడం సహా చాలా ప్రయోజనాలు, ఎలా వాడాలంటే..

Ayurveda: ఈ ఆయుర్వేద మూలిక గురించి తెలుసా? జలుబు, దగ్గు తగ్గించడం సహా చాలా ప్రయోజనాలు, ఎలా వాడాలంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 02, 2024 04:30 PM IST

Ayurveda - Athimadhuram (Mulethi): అతిమధురంలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అతిమధురం లాభాలు ఏంటి.. ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకోండి.

Ayurveda: ఈ ఆయుర్వేద మూలిక గురించి తెలుసా? జలుబు, దగ్గు తగ్గించడం సహా చాలా ప్రయోజనాలు, ఎలా వాడాలంటే..
Ayurveda: ఈ ఆయుర్వేద మూలిక గురించి తెలుసా? జలుబు, దగ్గు తగ్గించడం సహా చాలా ప్రయోజనాలు, ఎలా వాడాలంటే..

ఆయుర్వేదంలో ‘అతిమధురం’ ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న మూలికల్లో ముందు వరుసలో ఉంటుంది. అతిమధురం మొక్క వేరు(మూలిక)కు శక్తివంతమైన గుణాలు ఉంటాయి. దీన్ని హిందీలో ములేతి అని పిలుస్తారు. ఈ అతిమధురం మూలిక వాడడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. శ్వాసకోశ ఇబ్బందులు తగ్గించడం నుంచి జ్ఞాపకశక్తి మెరుగుదల వరకు ఇది చాలా లాభాలను కలిగిస్తుంది. అతిమధురం ప్రయోజనాలు, ఎలా వాడాలో ఇక్కడ చూడండి.

అతిమధురం వాడకం ఇలా.. టీ తయారీ

  • అతిమధురం వేరును నేరుగా కూడా నమలవచ్చు. ఓ ముక్కను ఆ నోట్లో వేసుకొని నమలాలి.
  • అతిమధురంతో టీ కూడా చేసుకోవచ్చు. ముందుగా వీటి వేర్లపై ఉన్న తొక్కను తొలగించాలి. ఆ తర్వాత ఓ కప్పు నీళ్లలో రెండు అతిమధురం మూలిక ముక్కలను వేసి సుమారు 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. దీంతో నీళ్లలోకి అతిమధురం గుణాలు దిగుతాయి. ఆ తర్వాత వడగడితే టీ తయారవుతుంది. ఈ టీలో రుచి కోసం తేనె వేసుకోవచ్చు. నీరు మరిగే సమయంలో కావాలంటే కాస్త దంచిన అల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు.
  • అతిమధురం మూలికలను పొడిలా చేసుకోవచ్చు. ఈ పొడి, తేనె సమాన మోతాదులో కలిపి తినొచ్చు. అతిమధురం పొడితోనూ టీ చేసుకోవచ్చు.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

అతిమధురం వేర్లలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‍ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. మరిన్ని పోషకాలు ఉంటాయి. అతిమధురం మూలికలు వాడితే జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశనం కలుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

రోగ నిరోధక శక్తి

శరీరంలో రోగ నిరోధక శక్తిని అతిమధురం వేర్లు పెంచగలవు. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల రిస్కును తగ్గించలవు. రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉండే చలికాలంలో దీన్ని వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వ్యాధి కారకాలతో శరీరం మెరుగ్గా పోరాడేందుకు సహకరిస్తుంది.

నెలసరి నొప్పి ఉపశమనం

పీరియడ్స్ సమయంలో మహిళలకు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. వీటిని సహజంగా తగ్గించుకోవాలని కొందరు భావిస్తుంటారు. అలాంటి వారికి అతిమధురం వేర్లు బెస్ట్ ఆప్షన్. అతిమధురం టీ తాగితే నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

జీర్ణక్రియకు.. నోటి ఆరోగ్యానికి..

అతిమధురం.. యాంటాసిడ్‍గా ఉపయోగపడుతుంది. ఇందులో గ్లిసిరిజిన్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు అతిమధురం తోడ్పడుతుంది. నోటి ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. నోట్లో క్రిములను తొలగిస్తుంది. దుర్వాసనను పోగొడుతుంది.

జ్ఞాపకశక్తి పెరిగేలా..

అతిమధురం మెదడు పనితీరును కూడా మెరుగుపరచగలదు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.

Whats_app_banner