Ishq Re Release Collection: ఇష్క్ రీ రిలీజ్- అన్ని చోట్ల హౌజ్‌ఫుల్- థియేటర్‌లో నితిన్ డ్యాన్స్- కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Nithin Ishq Re Release Box Office Collections: హీరో నితిన్ కెరియర్‌లో రొమాంటిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మూవీ ఇష్క్. నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఇష్క్ రీ రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్ల హౌజ్‌ఫుల్ అయి జోరు చూపించింది. ఈ నేపథ్యంలో ఇష్క్ రీ రిలీజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Nithin Ishq Re Release Collections: టాలీవుడ్ హీరో నితిన్ కథానాయకుడిగా, నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా ఇష్క్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఇష్క్ సినిమాను 2012లో ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. అప్పుడు ఈ రొమాంటిక్ మూవీని తెలుగు ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేశారు.
నితిన్-నిత్యా మీనన్ కెమిస్ట్రీ
సున్నితమైన ప్రేమకథను తెరకెక్కించిన తీరుని ఇప్పటికీ ఆడియెన్స్ మరచిపోనంత ఆదరణను దక్కించుకుంది ఈ ఇష్క్ మూవీ. అలాగే రాహుల్ పాత్రలో నటించిన నితిన్, ప్రియ పాత్రలో నటించిన నిత్యా మీనన్ మధ్య కెమిస్ట్రీ సినిమా సక్సెస్‌లో తన వంతు పాత్రను పోషించింది.
అన్ని చోట్ల హౌజ్‌ఫుల్
అయితే, ఇప్పుడీ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ ఇష్క్‌ను నవంబర్ 30న ఏపీ, తెలంగాణ, బెంగుళూరులో 65కి పైగా థియేటర్స్‌లో రీ రిలీజ్ చేయగా అన్నిచోట్ల హౌజ్‌ఫుల్ అయి సత్తా చాటింది. అలాగే ఈ సినిమాతో పాటు చాలా కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ ఈ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావటం విశేషం. అంతేకాకుండా కొత్త సినిమాలకు కూడా కానంతగా ఈ మూవీకి అన్ని చోట్ల హౌజ్ ఫుల్ కావడం విశేషం.
వీకెండ్‌లో మరింతగా
ఇక ప్రీ బుకింగ్ టికెట్ సేల్స్ ప్రకారం ఇష్క్ సినిమాకు 8 వేల లోపు టికెట్స్ అమ్ముడు పోయాయి. దాదాపుగా 10 వేల రేంజ్‌లో ఇష్క్ మూవీ టికెట్స్ సేల్ అయిపోయాయి. ఈ లెక్కన ఇష్క్ సినిమాకు రూ. 85 నుంచి 90 లక్షల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయినట్లు సమాచారం. మొదటి రోజు గట్టి కలెక్షన్స్ రాబట్టిన ఇష్క్ సినిమా వీకెండ్‌లో మరింత జోరును పెంచినట్లు తెలుస్తోంది.
ఇష్క్ రీ రిలీజ్ కలెక్షన్స్
మొత్తంగా రీ రిలీజ్ అయిన ఇష్క్ మూవీకి రూ. 1.6 నుంచి 1.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇలా రి రిలీజ్‌లోను ఇష్క్ సినిమా కలెక్షన్లలో జోరు చూపించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే, ఇష్క్ సినిమాలోని చక్కటి కామెడీ, సునిశితమైన ప్రేమకథను, అనూప్ రూబెన్స్ సూపర్బ్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయటానికి ఆడియెన్స్ థియేటర్స్‌కు క్యూ కట్టారు.
థియేటర్‌లో నితిన్ డ్యాన్స్
హీరో నితిన్, దర్శకుడు విక్రమ్ కె. కుమార్, నిర్మాత సుధాకర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్‌కు వెళ్లి అక్కడ ఆడియెన్స్‌తో కలిసి సినిమాను చూసి ఎంజాయ్ చేయటమే కాకుండా మూవీలోని ఓ పాటకు ఆడియెన్స్‌తో కలిసి డాన్స్ కూడా చేశారు.
నితిన్ నెక్ట్స్ మూవీస్
ఇదిలా ఉంటే, ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్‌కు జోడీగా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తుంది. రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నితిన్ ‘తమ్ముడు’ మూవీ వచ్చే ఏడాది మహా శివరాత్రికి విడుదలకానుంది.
టాపిక్