Ishq Jaisa Kuch Song: ఫైటర్ నుంచి ‘ఇష్క్ జైసా’ ఫుల్ సాంగ్ రిలీజ్: హృతిక్, దీపిక హాట్ రొమాన్స్: వీడియో-bollywood news in telugu fighter second single ishq jaisa kuch song released hrithik roshan deepika padukone hot romance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ishq Jaisa Kuch Song: ఫైటర్ నుంచి ‘ఇష్క్ జైసా’ ఫుల్ సాంగ్ రిలీజ్: హృతిక్, దీపిక హాట్ రొమాన్స్: వీడియో

Ishq Jaisa Kuch Song: ఫైటర్ నుంచి ‘ఇష్క్ జైసా’ ఫుల్ సాంగ్ రిలీజ్: హృతిక్, దీపిక హాట్ రొమాన్స్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 22, 2023 04:48 PM IST

Ishq Jaisa Kuch Song: ఫైటర్ సినిమా నుంచి రెండో పాట రిలీజ్ అయింది. హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ కెమెస్ట్రీ ఈ పాటకు హైలైట్‍గా ఉంది.

Ishq Jaisa Kuch Song: ఫైటర్ నుంచి ‘ఇష్క్ జైసా’ ఫుల్ సాంగ్ రిలీజ్: హృతిక్, దీపికా హాట్ రొమాన్స్
Ishq Jaisa Kuch Song: ఫైటర్ నుంచి ‘ఇష్క్ జైసా’ ఫుల్ సాంగ్ రిలీజ్: హృతిక్, దీపికా హాట్ రొమాన్స్

Ishq Jaisa Kuch Song: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, అందాల భామ దీపికా పదుకొణ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఫైటర్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. వీరిద్దరూ తొలిసారి జంటగా నటిస్తుండటంతో మరింత క్రేజ్ ఉంది. ఇటీవలే వచ్చిన ఫైటర్ టీజర్ కూడా ఆకట్టుకుంది. కాగా, ఈ చిత్రం నుంచి ‘ఇష్క్ జైసా కుచ్’ పూర్తి సాంగ్ రిలీజ్ అయింది. ఇటీవల ప్రోమోతో ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. నేడు (డిసెంబర్ 22) ఫుల్ సాంగ్ వచ్చేసింది.

ఫైటర్ చిత్రం నుంచి రెండో పాటగా ‘ఇష్క్ జైసా కుచ్’ వచ్చింది. ఈ వీడియో సాంగ్‍ను మూవీ యూనిట్ నేడు రిలీజ్ చేసింది. ఈ పాటకు విశాల్, శేఖర్ స్వరాలు సమకూర్చారు. వారిద్దరితో పాటు ఈ పాటను శిల్పా రావు, మెల్లో పాడారు. కుమార్ లిరిక్స్ అందించారు.

ఈ పాటలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ లుక్స్ అదిరిపోయాయి. బీచ్‍లో వీరిద్దరి మధ్య రొమాన్స్ స్పెషల్ హైలైట్‍గా ఉంది. అలాగే, హృతిక్, దీపికా డ్యాన్స్ స్టెప్స్ కూడా అదిరిపోయాయి. మొత్తంగా హృతిక్, దీపిక మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. షర్ట్ లెస్‍గా హృతిక్ తన కండలను మరోసారి ఈ పాటలో ప్రదర్శించాడు. బికినీలో అందాలను ఆరబోశారు దీపిక. ఫైటర్ సినిమాకు ఈ పాట స్పెషల్ అట్రాక్షన్‍గా మారింది.

ఫైటర్ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా హృతిక్, దీపికా పదుకొణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో వైమానిక విన్యాసాలు హైలైట్‍గా ఉండనున్నాయి. ఈ చిత్రంలో అనిల్ కపూర్, మినాల్ రాథోడ్, కరణ్ సింగ్ గ్రోవర్, సంజీద షేక్, తలాత్ అజిజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. వియాకామ్ 18 స్టూడియోస్, మార్ఫిక్స్ పిక్చర్స్ పతాకాలు నిర్మిస్తున్నాయి. రిపబ్లిక్ డే ముందు రోజు 2024 జనవరి 25న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

Whats_app_banner