Shobitha Shivanna : నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి, వైద్యులు ఏం నిర్థారించారంటే?
Shobitha Shivanna : సీరియల్ నటి శోభిత శివన్న మృతదేహానికి పోస్టుమార్టం ముగిసింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శోభిత సూసైడ్ చేసుకునే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తెలిపారు.
Shobitha Shivanna : హైదరాబాద్ గచ్చిబౌలిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కన్నడ సీరియల్ నటి శోభిత శివన్న మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. శోభిత మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. శోభిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కర్ణాటకలోని ఆమె స్వస్థలానికి తలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం శోభిత సూసైడ్ చేసుకునే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తెలిపారు.
కర్నాటక రాష్ట్రం హసన్ జిల్లాకు చెందిన శోభిత శివన్న(32) కన్నడ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించారు. గతేడాది ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి సుధీర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పిన శోభిత గచ్చిబౌలి శ్రీరాంనగర్‌లో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన సుధీర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవారు. ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా నటి శోభితతో సుధీర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి గతేడాది మే 21న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన వీరిద్దరూ శ్రీరాంనగర్‌లో ఉంటున్నారు. సుధీర్ రెడ్డి హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.
నవంబర్ 30వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో భర్త సుధీర్ రెడ్డితో కలిసి భోజనం చేసిన శోభిత, తన బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. మరో బెడ్ రూమ్ లో సుధీర్‌రెడ్డి వర్క్ చేసుకుంటూ అక్కడే నిద్రపోయారు. ఆదివారం ఉదయం పనిమనిషి వచ్చి శోభిత బెడ్ రూమ్ డోర్కొట్టగా తీయలేదు. దీంతో అనుమానంతో సుధీర్ రెడ్డి డోర్ పగులగొట్టి చూడగా నటి శోభిత ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే శోభిత గదిలో సూసైడ్ లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
సూసైడ్ లేఖలో
సూసైడ్ నోట్ లో "యు కెన్ డూ ఇట్" అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ లేఖ రాసిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత సూసైడ్ కు డిప్రెషన్ కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. గత కొన్నేళ్లుగా ఆమె సీరియల్స్ తో పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. భర్త సుధీర్ రెడ్డి, శోభిత మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? వారి మధ్య ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత కథనం