తెలుగు న్యూస్ / ఫోటో /
Vaccine Benefits: వ్యాధి నిరోధకత పెంచడంలో కీలకం.. వ్యాక్సిన్లను పొరపాటున విస్మరించకండి..
- Vaccine Benefits: అంటువ్యాధులు మానవాళి ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు. వీటి నివారణలో ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత టీకాలు పుట్టుకొచ్చాయి. వ్యాధులు సోకకుండా వ్యాధి నిరోధకత పెంచడంతో వ్యాక్సిన్ల పాత్ర మరువలేనిది. వ్యాక్సిన్ల వల్ల పిల్లలు అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందగలుగుతున్నారు.
- Vaccine Benefits: అంటువ్యాధులు మానవాళి ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు. వీటి నివారణలో ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత టీకాలు పుట్టుకొచ్చాయి. వ్యాధులు సోకకుండా వ్యాధి నిరోధకత పెంచడంతో వ్యాక్సిన్ల పాత్ర మరువలేనిది. వ్యాక్సిన్ల వల్ల పిల్లలు అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందగలుగుతున్నారు.
(1 / 11)
టీకాలు వేయించుకోకపోతే పుట్టిన ప్రతి వందమందిలో ముగ్గురు మీజిల్స్ సమస్యతో, ఇద్దరు కోరింత దగ్గుతో, ఒకరు ధనుర్వాతంతో మరణిస్తారు. ప్రతి రెండు వందల మందిలో ఒకరు పోలియో బారిన పడతారు.
(2 / 11)
అంటు వ్యాధులు రాకుండా తట్టుకునే జీవశక్తిని ఇమ్యూనిటీ అంటారు. శరీరానికి చెందని పదార్ధాన్ని ఇతర పదార్ధంగా గుర్తించి దానిని అడ్డుకుని నిర్మూలించడంలో ఇమ్యూనిటీ పనిచేస్తుంది. ఆ తర్వాత దానిని విసర్జిస్తుంది.
(3 / 11)
శరీరానికి సరిపడని ఇతర పదార్ధాలను గుర్తించి వాటిని ఎదుర్కొనే యాంటీ బాడీలను రూపొందించేలా వ్యాక్సిన్లు పనిచేస్తాయి. యాంటీబాడీలు మాంసకృతుల రూపంలో, లింఫోసైట్స్ తెల్లరక్త కణాలుగా ఈ పని చేస్తాయి. ఈ రకమైన శక్తిని తల్లినుంచి, అంతకు ముందు వచ్చిన వ్యాధుల నుంచి శరీరానికి లభిస్తుంది.
(4 / 11)
జాతిపరంగా, శంశపారంపర్యంగా సంక్రమించే రోగనిరోధక శక్తిని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. జంతువులలో ఉండే అనేక రకాల వ్యాధులు మనుషుల్లో ఉండవు. మనుషుల్లో ఉండే వ్యాధులు జంతువుల్లో ఉండవు. అయా జాతుల్లో ఉండే ప్రత్యేక ఇన్నేట్ ఇమ్యూనిటీ దీనికి కారణం.
(5 / 11)
రోగకారకాలైన బాక్టీరియా, వైరస్ శరీరంలో ప్రవేశించడం వల్ల టీకాల వల్ల రోగ నిరోధక శక్తి శరీరానికి లభిస్తుంది. ఈ రకమైన ఇమ్యూనిటీతో శరీరంలో రోగ నిరోధక యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. బాక్టీరియా, వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కొంత కాలానికి ఈ శక్తి సమకూరుతుంది.
(6 / 11)
పాసివ్ ఇమ్యూనిటీలో ఇతరు శరీరంలో లేదా జంతువులలో తయారైన యాంటీ బాడీలను సేకరించి శుద్ధి చేసిన ఇంజెక్షన్ల ద్వారా ఇస్తారు. యాంటీ టెటనస్ ఇంజెక్షన్ ద్వాారా యాంటీ బాడీలు శరీరంలో ప్రవేశించగానే రోగనిరోధక శక్తి వస్తుంది. కాని దీని వల్ల దీర్ఘకాలిక ఉపయోగం ఉండదు. శరీరంలో యాంటీ బాడీల పరిమాణం తగ్గితే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
(7 / 11)
అంటు వ్యాధులను తట్టుకునే ప్రజల సామూహిక రోగనిరోధక శక్తి హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఈ శక్తి ప్రజల్లో తక్కువగా ఉంటే రోగాలు ఎక్కువగా వ్యాపిస్తాయి.
(8 / 11)
రోగాలు వేగంగా వ్యాప్తి చెందడాన్ని ఎపిడెమిక్ అంటారు. 90శాతం పిల్లలకు టీకాలు ఇవ్వడం ద్వారా ఆ శక్తి పెరిగి రోగాల వ్యాప్తి తగ్గుతుంది. క్రమేణా ఆ జబ్బు కనిపించకుండా కూడా పోవచ్చు. ఇలా స్మాల్ ఫాక్స్, పోలియో వంటి వ్యాధులు కనుమరుగై పోయాయి.
(10 / 11)
వ్యాక్సిన్ ఇచ్చిన కొంత కాలానికి వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. కానీ వ్యాధి లక్షణాలు సాధారణంగా కనిపించవు. టీకాలను బాక్టీరియా, వైరస్‌ల నుంచి కొన్ని సార్లు వైరస్ స్రవించే టాక్సిన్‌ల నుంచి తయారు చేస్తారు.
ఇతర గ్యాలరీలు