JEE Advanced 2025 : జేఈఈ రాసే వారికి అలర్ట్! అడ్వాన్స్డ్ పరీక్షపై కీలక అప్డేట్..
JEE Advanced 2025 date : జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష తేదీని ప్రకటించారు. అడ్వాన్స్డ్ పరీక్ష తేదీతో పాటు ఇతర వివరాలను ఈ కింద తెలుసుకోండి..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2025 పరీక్ష షెడ్యూల్‌ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) కాన్పూర్ సోమవారం విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు టైమ్ టేబుల్‌తో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను jeeadv.ac.in అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు.
అధికారిక షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 18, 2025న నిర్వహించనున్నారు. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో మూడు గంటల పాటు జరుగుతాయి.
“జేఈఈ (అడ్వాన్స్డ్) 2025 మే 18, 2025 ఆదివారం జరుగుతుంది. పరీక్షలో మూడు గంటల వ్యవధి గల రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. రెండు పేపర్లలో హాజరు కావడం తప్పనిసరి,” అని అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఐఐటి కాన్పూర్ జేఈఈ అడ్వాన్స్డ్ 2025 కోసం అర్హత ప్రమాణాలను ఇప్పటికే వెల్లడించింది. భారతీయ పౌరుల కోసం, జేఈఈ మెయిన్ 2025 లో పర్ఫార్మెన్స్, వయోపరిమితి, అటెంప్ట్ నెంబర్, 12వ తరగతి పరీక్షలో హాజరు, ఐఐటిలలో మునుపటి ప్రవేశం వంటి ఐదు అర్హత ప్రమాణాలు ఉన్నాయి.
జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) జేఈఈ అడ్వాన్స్‌డ్‌కి గతంలో ఉన్న అర్హత ప్రమాణాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది.
పరీక్షకు సంబంధించిన ఇతర షరతులన్నీ నవంబర్ 5 న ప్రకటించిన విధంగానే ఉంటాయని బోర్డు తెలిపింది. మరిన్ని సంబంధిత సమాచారం కోసం అభ్యర్థులు jeeadv.ac.in వద్ద జేఈఈ అడ్వాన్స్డ్ 2025 అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు.
జేఈఈ మెయిన్స్ 2025 వివరాలు..
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష 2025 జనవరి 22 నుంచి జనవరి 31, 2025 వరకు జరుగుతుంది. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సిటీ స్లిప్ 2025 జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కటాఫ్ మార్కుల కన్నా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వారు జేఈఈ అడ్వాన్స్డ్ 2025కు అర్హత సాధిస్తారు.
ఈ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ఇటీవలే ముగిసింది.
సంబంధిత కథనం