Karnataka Bank PO recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! కర్ణాటక బ్యాంక్‌లో పీఓ రిక్రూమెంట్ షురూ..
Karnataka bank PO apply online : కర్ణాటక బ్యాంకులో పీఓ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్హత, వయస్సు పరిమితి, ఫీజు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నిరుద్యోగులకు, బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్! కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ (కేబీఎల్) ప్రొబేషనరీ ఆఫీసర్ స్కేల్ 1 రిక్రూట్మెంట్ 2024 ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల వారు కేబీఎల్ అధికారిక వెబ్సైట్ (karnatakabank.com) లో అప్లికేషన్ని దాఖలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కర్ణాటక బ్యాంక్‌లో ఉద్యోగాలు..
పోస్టు వివరాలు:- ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) స్కేల్ 1
విద్యార్హత:- ఏ సబ్జెక్ట్‌లో అయినా మాస్టర్ డిగ్రీ లేదా అగ్రికల్చర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా 5ఏళ్ల లా కోర్సులో బ్యాచిలర్ డిగ్రీ లేదా సీఏ/సీఎస్/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ క్వాలిఫికేషన్
వయస్సు:- కనీస వయస్సు లిమిట్ లేదు; గరిష్ట వయస్సు పరిమితి 28ఏళ్లు. కర్ణాటక బ్యాంక్ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం వయస్సు పరిమితిలో అర్హులకు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:-
- అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ- నవంబర్ 30, 2024
- అప్లికేషన్‌కు చివరి తేదీ- డిసెంబర్ 10, 2024
- ఫీజు చెల్లింపునకు చివరి తేదీ- డిసెంబర్ 10, 2024
- కేబీఎల్ సీఎస్ఏ పరీక్ష తేదీ- డిసెంబర్ 22, 2024
- అడ్మిట్ కార్డుల జారీ- తెలియాల్సి ఉంది.
అప్లికేషన్ ఫీజు:-
- జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్- రూ. 800
- ఎస్సీ/ఎస్టీ- రూ. 700
డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్ మార్గాల్లో ఫీజు కట్టవచ్చు.
కర్ణాటక బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ స్కేల్ 1 రిక్రూట్మెంట్ 2024 కోసం ఇలా అప్లై చేసుకోండి..
స్టెప్ 1:- సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్లో కనిపించే లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 2:- ఎలిజిపిలిటీ, ఐడీ ప్రూఫ్, అడ్రెస్ వివరాలు ఇతర బెసిక్ డీటైల్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని సమర్పించండి.
స్టెప్ 3:- ఫొటో, సైన్ చేసిన ఫొటో, ఐడీ ప్రూఫ్ వంటివి సమర్పించండి.
స్టెప్ 4:- సబ్మీట్ చేసే ముందు ప్రివ్యూ చూసుకోండి. తప్పులను సరిచేసుకోండి. సబ్మీట్ చేయండి.
స్టెప్ 5:- తదుపరి అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లోని అధికారిక నోటిఫికేషన్ని చూడాల్సి ఉంటుంది.
ఎన్టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంస్థలో అసిస్టెంట్ ఆఫీసర్(సేఫ్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి అభ్యర్థులు డిసెంబరు 10వ తేదీ లోగా ఆన్‌లైన్(https://careers.ntpc.co.in) లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.30,000 - రూ.1,20,000 వరకు వేతనం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం