Death clock : మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పే యాప్​ ఇది! 'ఏఐ' కౌంట్​డౌన్​ కూడా స్టార్ట్​ చేస్తుంది..-death clock can ai predict when you will die this ai app claims results are significant ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Death Clock : మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పే యాప్​ ఇది! 'ఏఐ' కౌంట్​డౌన్​ కూడా స్టార్ట్​ చేస్తుంది..

Death clock : మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పే యాప్​ ఇది! 'ఏఐ' కౌంట్​డౌన్​ కూడా స్టార్ట్​ చేస్తుంది..

Sharath Chitturi HT Telugu
Dec 02, 2024 02:38 PM IST

Death clock AI : డెత్ క్లాక్ అనే కొత్త ఏఐ ఆధారిత యాప్ మీ వ్యక్తిగత డేటా ఆధారంగా మీరు ఎప్పుడు చనిపోతారో అంచనా వేస్తుంది! అదే సమయంలో ఆరోగ్యకరమైన జీవితం కోసం చిట్కాలను అందిస్తుంది. ఈ యాప్​కి సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది.

మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పే యాప్​ ఇది!
మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పే యాప్​ ఇది! (Pixabay)

మరణం.. ప్రతి మనిషిని భయపెట్టే విషయం! మృత్యువు ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదు. కానీ దాని గురించి ఆలోచించి చాలా మంది భయపడుతూ ఉంటారు. అయితే, మీ మరణాన్ని కచ్చితత్వంతో, డేట్​తో సహ చెబుతానని అంటోంది ఏఐ ఆధారిత “డెత్​ క్లాక్​” అనే యాప్​! ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ యాప్ మీ మరణ తేదీని లెక్కించడానికి.. వయస్సు, బరువు, ఎత్తు, ఆహార- వ్యాయామ అలవాట్లతో సహా మీ వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తుంది. 1.25 లక్షలకు పైగా డౌన్​లోడ్స్​తో ఈ యాప్ ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింది.​

బ్రెంట్ ఫ్రాన్సన్ అభివృద్ధి చేసిన ఈ యాప్​లోని ఏఐ.. 1,200 లైఫ్​ ఎక్స్​పెక్టెన్సీ అధ్యయనాలపై శిక్షణ పొందింది. సాంప్రదాయ ఆయుర్దాయం నమూనాల కంటే ఈ ఏఐ మరింత ఖచ్చితమైన అంచనాను అందిస్తుందని ఫ్రాన్సన్ పేర్కొన్నారు.

ఇదొక ఫ్రీ యాప్​. కానీ కౌంట్​డౌన్​తో పాటు మరిన్ని ఫీచర్స్​ని యాక్సెస్ చేయడానికి 40 డాలర్ల వార్షిక డెత్​ క్లాక్​ సబ్​స్క్రిప్షన్ అవసరం. యూజర్లు తమ పుట్టిన తేదీ, లింగం, బీఎంఐ, స్మోకింగ్​ అలవాట్లు, నివసించే దేశం వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా, యాప్ సదరు వ్యక్తి మరణం డేట్​ని అంచనా వేస్తుంది. అక్కడి నుంచి సెకన్​ బై సెకన్​ కౌంట్​డౌన్​ని కూడా ఇస్తుంది. అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మీ జీవితాన్ని పొడిగించుకోవడానికి జీవనశైలి మార్పులను సైతం సూచిస్తుంది.

ఆరోగ్య ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ఈ డెత్​ క్లాక్​ యాప్​ పర్సనలైజ్​డ్​ టిప్స్​ని అందిస్తుంది. ఈ సిఫార్సుల్లో ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, సమతుల్య ఆహారం తినడం, మద్యపానాన్ని పరిమితం చేయడం, తగినంతగా నిద్రపోవడం, ఒత్తిడిని నిర్వహించడం, సామాజికంగా కనెక్ట్ కావడం వంటివి ఉన్నాయి.

డెత్ క్లాక్ సూచించిన కొన్ని జీవనశైలి మార్పులు:

ఆరోగ్యకరమైన బరువును మెయిన్​టైన్​ చేయాలి: ఆరోగ్యకరమైన బరువును సాధించడం డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ధూమపానం మానేయండి: పొగాకుకు దూరంగా ఉండటం గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, వివిధ క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది.

బ్యాలెన్స్​డ్​ డైట్​: పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయండి: ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం వల్ల కాలేయ వ్యాధి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి: నాణ్యమైన నిద్ర పొందడం మానసిక, శారీరక శ్రేయస్సుకు అవసరం.

రెగ్యులర్ చెకప్​లు చేయించుకోవాలి: రొటీన్ మెడికల్ స్క్రీనింగ్​లతో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం జరుగుతుంది..

ఒత్తిడిని మేనేజ్​ చేయాలి: మెడిటేషన్​ వంటి టెక్నిక్స్​తో ఒత్తిడిని జయించి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవలి.

సామాజికంగా కనెక్ట్ అవ్వండి: రిలేషన్స్​ బిల్డ్​ చేసుకోండి. సోషల్​గా యాక్టివ్​గా ఉండండి.

డెత్​ క్లాక్​ అనేది ఒక భయంకరమైన కాన్సెప్ట్​గా అనిపిస్తున్నప్పటికీ, ఈ యాప్ వినియోగదారులకు వారి ఆరోగ్యాన్ని నియంత్రించడానికి ఒక సాధనంగా నిలుస్తుంది. ఈ యాప్​ అంతిమ లక్ష్యం మెరుగైన జీవనశైలి మార్పులకు ప్రేరేపించడం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రజలను ప్రోత్సహించడం.

Whats_app_banner

సంబంధిత కథనం