అరచేతులు రుద్దడం అనేది సాధారణ చర్య. ఇలా చేయడం వల్ల అరచేతుల మధ్య వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వ్యాయమం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అరచేతులు రుద్దడం వల్ల కలిగి 7 మానసిక ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Oct 22, 2024

Hindustan Times
Telugu

దృష్టి కేంద్రీకరణ  - మీ అరచేతులను రుద్దినప్పుడు అటెన్షన్ లోకి వస్తారు. మీ ఫోకస్ మెరుగుపడుతుంది. ముఖ్యంగా పని సమయాల్లో మీ మనస్సును ట్రాక్ లోకి తీసుకురావడానికి ఇది సులభమైన మార్గం.  

pexels

ఒత్తిడిని తగ్గిస్తుంది - అరచేతులను రుద్దడం వల్ల రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది ప్రశాంతతను పెంచి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. బిజీగా ఉన్న రోజులో ఒత్తిడిని తగ్గించే గొప్ప సాధనం ఇది.  

pexels

నిద్ర పట్టడానికి - మీకు నిద్రపట్టకపోతే, మీ మనస్సును రిలాక్స్ చేయడానికి పడుకునే ముందు అరచేతులను రుద్దండి. ఈ అభ్యాసం మీ ఆలోచనలను కంట్రోల్ చేస్తుంది. దీంతో నిద్రపోయేందుకు మీ మనస్సు, శరీరాన్ని సిద్ధం చేస్తుంది.  

pexels

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది - మీరు నిరుత్సాహంగా ఉన్నట్లయితే, అరచేతులను రుద్దడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. అరచేతులను రుద్దడం వల్ల కలిగే ఘర్షణతో బ్రెయిన్ లో ఎండార్ఫిన్ లను విడుదల చేయడాన్ని సూచిస్తుంది. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు సాయపడుతుంది.  

ఎనర్జీని పెంచుతుంది - మీరు తరచూ డల్ గా ఉంటున్నారా? అయితే మీ ఎనర్జీని పెంచుకునేందుకు ఉత్తేజంగా మారేందుకు అరచేతులను రుద్దండి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి తక్షణ శక్తిని అందిస్తుంది.  

pexels

ఆలోచనలను కంట్రోల్ చేసేందుకు- మీకు ఆందోళనకరమైన ఆలోచనలు వస్తుంటే, వాటి నుంచి తక్షణ ఉపశమనం కోసం మీ అరచేతులను రుద్దండి. టెన్షన్ పడుతున్నప్పుడు ఇలా చేస్తే రిలీఫ్ ఉంటుంది.  

మైండ్ ఫుల్ నెస్ - అరచేతులను రుద్దడం వల్ల మీ శరీరాన్ని ట్యూన్ చేసుకోవచ్చు. మీ ఆలోచనల నుంచి బ్యాక్ కు వచ్చి మళ్లీ పరిసరాలతో కనెక్ట్ అవుతారు.  

శృంగారం కేవలం తృప్తి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినట్టుగా అవుతుంది.

Unsplash