NTPC Recruitment 2024 : భారీ జీతంతో ఎన్టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు, ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇలా-delhi ntpc recruitment for 50 assistant officer safety online application process eligibility details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ntpc Recruitment 2024 : భారీ జీతంతో ఎన్టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు, ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇలా

NTPC Recruitment 2024 : భారీ జీతంతో ఎన్టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు, ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇలా

Bandaru Satyaprasad HT Telugu
Dec 02, 2024 03:11 PM IST

NTPC Recruitment 2024 : ఎన్టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీ లోపుగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు వేతనం ఉంటుంది.

భారీ జీతంతో ఎన్టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు, ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇలా
భారీ జీతంతో ఎన్టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు, ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇలా

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) సంస్థలో అసిస్టెంట్ ఆఫీసర్‌(సేఫ్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత ఇంజినీరింగ్‌ డిగ్రీ కలిగి అభ్యర్థులు డిసెంబరు 10వ తేదీ లోగా ఆన్‌లైన్‌(https://careers.ntpc.co.in) లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.30,000 - రూ.1,20,000 వరకు వేతనం చెల్లిస్తారు.

ఎన్టీపీసీ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 26 నుంచి ప్రారంభమైంది. తగిన అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తులను డిసెంబర్ 10, 2024లోపు సమర్పించాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో పనితీరు ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈవో గ్రేడ్‌లో నెలకు 30000-120000 జీతం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు

  • జనరల్/ఈడబ్ల్యూ/ఓబీసీ -రూ. 300
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ స్త్రీలు- NIL

ఎన్టీపీసీ అసిస్టెంట్ ఆఫీసర్ ఆన్‌లైన్ దరఖాస్తు విధానం

Step 1 : ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్ https://ntpc.co.in ని సందర్శించి, కెరీర్ విభాగానికి వెళ్లండి.

Step 2 : ఈవో లెవెల్, అడ్వాంటేజ్ వద్ద అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3: రిజిస్టర్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, రాష్ట్రం, ప్రస్తుత చిరునామా, వర్గం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేసి రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించండి.

Step 4: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి యూజర్ ఐడీ, ఈమెయిల్‌తో పోర్టల్‌కి లాగిన్ చేయండి.

Step 5: అప్లికేషన్ లో అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

Step 6 : దరఖాస్తు రుసుములను ఆన్‌లైన్‌లో చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

Step 7: సబ్మిట్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

సింగరేణిలో ఉద్యోగాలు

సింగ‌రేణిలో ఇంట‌ర్న‌ల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 64 జూనియ‌ర్ స‌ర్వే ఆఫీస‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 28వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు… డిసెంబర్ 07వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత హార్డ్ కాపీని డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం 5లోపు సమర్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. హార్డ్ కాపీలను 'జనరల్ మేనేజర్ వెల్ఫేర్ ఆర్సీ కొత్తగూడెం యూనిట్ లో ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే వారికి ఎలాంటి వయోపరిమితి లేదు. హార్డ్ కాపీలను సమర్పించకపోతే దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మైన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అంతేకాకుండా.. మూడేళ్లపాటు మైన్స్ సర్వేయర్ గా పని చేసిన అనుభవం కూడా ఉండాలి. ఎంపికైన వారి రూ. 40 వేల నుంచి రూ. 1,40,000 జీతం చెల్లిస్తారు. రిక్రూట్ మెంట్ లో 59 ఉద్యోగాలను లోకల్ కేటగిరి, మిగిలిన 5 పోస్టులను ఆన్ రిజర్వ్ డ్ విభాగంలో భర్తీ చేస్తారు. https://scclmines.com/olappint552024/ లింక్ పై క్లిక్ చేసి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్