TG SSC Exams 2025 : పది పరీక్షల్లో 'గ్రేడిండ్' ఉండదు.. ఇక నుంచి మార్కులే - 5 ముఖ్యమైన అంశాలు-scraps of grading system in telangana ssc exams from this year 2024 10 key points read here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Ssc Exams 2025 : పది పరీక్షల్లో 'గ్రేడిండ్' ఉండదు.. ఇక నుంచి మార్కులే - 5 ముఖ్యమైన అంశాలు

TG SSC Exams 2025 : పది పరీక్షల్లో 'గ్రేడిండ్' ఉండదు.. ఇక నుంచి మార్కులే - 5 ముఖ్యమైన అంశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 01, 2024 01:21 PM IST

Telangana SSC Exams 2024 Updates : తెలంగాణ పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు వచ్చాయి. ఇక నుంచి గ్రేడింగ్ విధానం ఉండదు. మార్కుల రూపంలోనే ఫలితాలను వెల్లడించనున్నారు. ఈసారి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇటీవలే తీసుకొచ్చిన మార్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి..

తెలంగాణ పదో తరగతి పరీక్షలు
తెలంగాణ పదో తరగతి పరీక్షలు (image source unsplash.com)

పదో తరగతి పరీక్షల్లో మార్పులు వచ్చాయి. ఈ మేరకు ఇటీవలనే తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి మార్కుల రూపంలో తెలంగాణ టెన్త్ ఫలితాలను వెల్లడించనుంది.

నిజానికి ఇంటర్నల్ మార్కులను కూడా తొలగించాలని విద్యాశాఖ తొలుత నిర్ణయించింది. కానీ పలు వర్గాల నుంచి అభ్యంతరాలు రావటంతో వెనక్కి తగ్గింది. అయితే గ్రేడింగ్ విధానాన్ని మాత్రం ఎత్తివేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది నుంచి మార్కులను ప్రకటించనుంది. తెలంగాణ విద్యాశాఖ తీసుకొచ్చిన మార్పులెంటో ఇక్కడ చూద్దాం….

తెలంగాణ టెన్త్ పరీక్షల్లో మార్పులు - ముఖ్యమైన అంశాలు:

  1. ఈ విద్యా సంవత్సరం జరిగే తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో పలు మార్పుల ఉంటాయి. ఈ మేరకు విద్యాశాఖ ఇటీవలనే ఉత్తర్వులు జారీ చేసింది.
  2. ఈ ఏడాది(2025) ప్రకటించే ఫలితాల్లో గ్రేడింగ్ విధానం ఉండదు.
  3. గతంలో మాదిరిగానే మార్కులను ప్రకటించనున్నారు. మెమోలపై స్కోర్ వివరాలు ఉంటాయి.
  4. ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే ఇంటర్నల్ మార్కులు ( 20 ) ఉంటాయి.
  5. వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి వంద మార్కుల విధానం ఉంటుంది. ఇంటర్నల్ మార్కులు ఉండవు.

మరోవైపు తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజును స్వీకరిస్తున్నారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకునే అవకాశం ఉంటుంది.

రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాలి. మూడు పేపర్ల లోపు ఉంటే రూ. 110గా చెల్లించాలి. మూడు పేపర్ల కంటే ఎక్కువ బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులు రూ. 125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ. 60 చెల్లించాలి. https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మరోవైపు ఫీజు చెల్లింపు ఇబ్బందులకు పరిష్కరించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ లోనే పరీక్షల ఫీజును చెల్లించేలా ఆప్షన్ తీసుకొచ్చింది. పరీక్షల ఫీజు చెల్లించాలంటే విద్యార్ధులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు రుసుం కట్టాలి. ఫీజుల చెల్లింపుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా పరీక్షల విభాగం మరికొన్ని చర్యలను కూడా చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించటంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా తీసుకొచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం