CLAT 2025: రేపే క్లాట్ 2025 ఎగ్జామ్; టైమింగ్స్ తో పాటు ఈ కీలక వివరాలు గుర్తుంచుకోండి..
CLAT 2025: న్యాయ విద్యా కళాశాలల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్, 2025 (CLAT 2025) డిసెంబర్ 1వ తేదీన జరగనుంది. ఎగ్జామ్ డే గైడ్లైన్స్, అడ్మిట్ కార్డు లింక్, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
CLAT 2025: న్యాయ విద్యా కళాశాలల్లో అడ్మిషన్ల కోసం కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ 2024 డిసెంబర్ 1న క్లాట్ 2025 పరీక్షను నిర్వహించనుంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు పరీక్ష రోజు మార్గదర్శకాలు, అడ్మిట్ కార్డు లింక్, టైమింగ్స్, కీలక వివరాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
రేపు క్లాట్ 2025 పరీక్ష: టైమింగ్స్
క్లాట్ 2025 పరీక్ష డిసెంబర్ 1, 2024 న జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ లో ఈ క్లాట్ 2025 పరీక్షను నిర్వహిస్తారు.
క్లాట్ 2025 పరీక్ష: అడ్మిట్ కార్డు
క్లాట్ 2025 (CLAT 2025) అడ్మిట్ కార్డు నవంబర్ 15, 2024న విడుదలైంది. క్లాట్ 2025 కోసం హాల్ టికెట్ క్లాట్ అధికారిక వెబ్సైట్ consortiumofnlus.ac.in లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
- క్లాట్ 2025 కి అప్లై చేసిన విద్యార్థులు క్లాట్ అధికారిక వెబ్సైట్ consortiumofnlus.ac.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న క్లాట్ 2025 (CLAT 2025) అడ్మిట్ కార్డు లింక్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీలో విద్యార్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.
- అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
రేపు క్లాట్ 2025 పరీక్ష: మార్గదర్శకాలు
క్లాట్ 2025 కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష రోజు పాటించాల్సిన నియమనిబంధనలు consortiumofnlus.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అవి..
- పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పరీక్షా కేంద్రం ఆవరణలోకి ప్రవేశించి మధ్యాహ్నం 1.30 గంటలకల్లా హాల్/క్లాస్ రూమ్ లో తమకు కేటాయించిన సీట్ లో కూర్చోవాలి.
- పరీక్ష జరిగే గదిలోకి ఒకసారి ప్రవేశించిన అభ్యర్థులను సాయంత్రం 4 గంటల లోపు తరగతి గది నుంచి బయటకు అనుమతించరు.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ అడ్మిట్ కార్డును వెంట తీసుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేకపోతే అభ్యర్థులెవరినీ పరీక్ష ప్రాంగణంలోకి అనుమతించరు.
- బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను, పారదర్శక వాటర్ బాటిల్, అనలాగ్ వాచ్, గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ వంటి వాటిని మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
- ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ (electronic appliances) ను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.