TGPSC Group 2 Exams : ఈనెలలోనే తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు - 9వ తేదీన హాల్ టికెట్లు విడుదల-telangana group 2 hall tickets to released on 9th december 2024 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tgpsc Group 2 Exams : ఈనెలలోనే తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు - 9వ తేదీన హాల్ టికెట్లు విడుదల

TGPSC Group 2 Exams : ఈనెలలోనే తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు - 9వ తేదీన హాల్ టికెట్లు విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 01, 2024 07:03 AM IST

TGPSC Group 2 Exam Hall Tickets : తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 15, 16 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు

ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే గ్రూప్ 1తో పాటు గ్రూప్ 3 పరీక్షలను కూడా పూర్తి చేసింది. ఇక ఈనెలలోనే గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లపై కసరత్తు షురూ చేసింది. ఈనెల 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనుంది.

15, 16 తేదీల్లో పరీక్షలు…

గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారం... పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.ఇక డిసెంబరు 16వ తేదీన పేపర్​3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు.

గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్​టికెట్లు డౌన్​లోడ్​ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదించాలని టీజీపీఎస్సీ తెలిపింది. లేదా Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌ సందేహాలు పంపవచ్చని పేర్కొంది.

గ్రూప్ 2 హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులు TGPSC వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే Download Hall Ticket For Group-II Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండోలో టీజీపీఎస్సీ ఐడీ , పుట్టిన తేదీ వివరాలు ఎంట్రీ చేయాలి.
  • డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

కొనసాగుతున్న గ్రూప్ 1 మూల్యాంకనం :

మరోవైపు గ్రూప్ 1 ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… జవాబు పత్రాల మూల్యాంకం కొనసాగుతోంది. మూల్యాంకనం పూర్తి కాగానే… మెరిట్ జాబితాను సిద్ధం చేయనుంది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది.

ఇదంతా కూడా పూర్తి చేసేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. తుది ఫలితాలను ఫిబ్రవరి మాసంలో ప్రకటించాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది. ఇందుకు ఫిబ్రవరి 20వ తేదీలోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

మొత్తం 563 పోస్టులకు 2024 ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. 4,03,645 మంది అప్లికేషన్లు చేసుకోగా… జూన్‌ 9న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు ఎంపిక కాగా… వీరిలో 21,093 మంది మెయిన్స్ పేపర్లు రాశారు.

మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభమైంది. క్షుణ్ణంగా పరిశీలించి… మార్కులను కేటాయిస్తారు. ఆ తర్వాత మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. మొత్తంగా నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి ఏడాది లోపే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం