Feng Shui Tips: ఫెంగ్ షూయి ప్రకారం.. ఇంట్లో చేసే కొన్ని మార్పులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి-according to feng shui certain changes in the house will bring good luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Feng Shui Tips: ఫెంగ్ షూయి ప్రకారం.. ఇంట్లో చేసే కొన్ని మార్పులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి

Feng Shui Tips: ఫెంగ్ షూయి ప్రకారం.. ఇంట్లో చేసే కొన్ని మార్పులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి

Ramya Sri Marka HT Telugu
Dec 01, 2024 09:00 AM IST

Feng Shui Tips: వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యలకు వాస్తు శాస్త్రంలో సమాధానాలు, పరిష్కారాలు ఉంటాయి. అలాగే చైనీయులు నమ్ముకునే ఫెంగ్ షూయిలో కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టే నియమాలు ఎన్నో ఉన్నాయి. ఫెంగ్ షూయి ప్రకారం అదృష్టం వరించాలంటే ఇంట్లో ఎలాంటి మార్పులు చేయాలో చూద్దాం.

అదృష్టం వరించాలంటే ఇలా చేయండి
అదృష్టం వరించాలంటే ఇలా చేయండి

భారతీయులకు వాస్తు శాస్త్రం ఎంత ముఖ్యమైనదో చైనీయులకు ఫెంగ్ షూయి అంటే అంత ముఖ్యమైనది. వ్యక్తుల జీవితాలను సంతోషకరంగా, ఆరోగ్యదాయకంగా ఉంచేందుకు వీటిలో కొన్ని సిద్ధాంతాలు నియమాలు ఉంటాయి. అదృష్టం, విజయం వరించేలా చేసేందుకు ఇవి చాలా బాగా సహాయపడతాయి. శక్తుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడం, ఆరోగ్యం, సంపద, సాఫల్యం, సామరస్, శాంతి కలిగించే మార్గాలను సూచించడం ఈ శాస్త్రంలో భాగం. ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో లాఫింగ్ బుద్ధ, విండ్ చిమ్, ఫిష్ అక్వేరియం, చైనీస్ కాయిన్, క్రిస్టల్ బాల్ వంటి కొన్ని వస్తువులను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుందని నమ్ముతారు. జీవితంలోని అన్ని బాధలు,ఇబ్బందులు తొలగిపోయి కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఇవే కాకుండా వాస్తు లోపాల కారణంగా తలెత్తే అవరోధాలను అడ్డుకునేందుకు, అదృష్టం వరించేందుకు ఫెంగ్ షూయిలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

  • ఫెంగ్ షుయ్ ప్రకారం ఇళ్లు సుఖసంతోషాలతో నిండి ఉండాలంటే ఇంట్లోని వ్యక్తులు ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించాలని ఫెంగ్ షూచి సూచిస్తుంది. కనుక ఇంట్లో ఎప్పుడు నెమ్మదిగా, మంచిగా మాట్లాడండి. ప్రతికూల ఆలోచనలు ఇంట్లో ప్రతికూల శక్తులను ప్రసారం చేస్తాయి.
  • ఇంటి ప్రధాన గుమ్మానికి గంటలు లేదా నాణేలను వేలాడదీయాలి. మూడ నాణేలను తీసుకుని ఎరుపు వస్త్రంలో కట్టి డోర్ హ్యాండిల్స్ పైన బయటకు కనిపించేలా వేలాడదీయాలి. ఇంటి సభ్యులందరికీ శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.
  • ప్రధాన ద్వారం ముందు గుండ్రని గోపురం ఉండకూడదని ఫెంగ్ షూయి చెబుతోంది. సంతోషం, అదృష్టం వృద్ధి చెందడానికి ఓం, స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను మీ ఇంట్లో లేదా ద్వారాల వద్ద ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి.
  • ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో నీటి ఫౌంటేన్లు ఉంటే అదృష్టం వరిస్తుంది. నీటి ఫౌంటెన్లు మన ఇంటిలో శుభ శక్తిని ప్రసారం చేస్తాయి. వీటి ద్వారా పచ్చి నీరు ప్రవహించడం చి శక్తిని ఉత్తేజపరుస్తుంది.
  • ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా మరుగుదొడ్డి ఉండకూడదు. ఏదైనా కారణం వల్ల ఇలా ఉంటే ప్రధాన ద్వారానికి, మరుగుదొడ్డికి మధ్య అపారదర్శక గోడలను అడ్డంగా ఏర్పాటు చేసుకోవాలి.
  • ఇంట్లో అరోవానా చేప ఆనందానికి, శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నమని ఫెంగ్ షూయి చెబుతోంది. కనుక ఇల్లు లేదా కార్యాలయంలో అక్వేరియంను తెచ్చిపెట్టుకొడి. అందులో తప్పకుండా అరోవానా చేప, బంగారు రంగు చేపలను ఉంచండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్వేరియం ఎప్పుడూ వాయువ్ంయ లేదా ఆగ్నేయ దిశలో ఉండాలి.
  • ఫెంగ్ షుయ్ ప్రకారం ఇల్లు నిర్మించేటప్పుడు ఒకే దిశలో మూడు తలుపులు ఉండకుండా చూసుకోవాలి. ఇది కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒకవేళ అలా ఉంటే వెంటనే వెంటనే వాటిని మార్చేయాలి.
  • ఫెంగ్ షుయ్ ప్రకారం ఫ్రిజ్ ను ఇంటికి దక్షిణ దిశలో ఉంచకూడదు.ఇది ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. పడమర, నైరుతి దిశల్లో ఉంచడం వల్ల కుటుంబ శ్రేయస్సు, శాంతి పెరుగుతుంది. అదేవిధంగా మైక్రోవేవ్ ను ఇంటికి నైరుతి దిశలో ఉంచడం ఉత్తమమని భావిస్తారు.
  • ఇంట్లో క్రోకస్ మొక్కను పెంచుకోవడం అత్యంత శుభప్రదమని ఫెంగ్ షూయి చెబుతోంది. చాలా చిన్నగా ఉండే ఈ మొక్క ఇంట్లో శాంతి వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఇంట్లోని సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే ఈ చెట్టును పెంచుకుంటున్న వారు అది వాడిపోకుండా చూసుకోవాలి. వాడిపోయిన మొక్కలు, పువ్వులు దురదృష్టానికి చిహ్నం. కాబట్టి వెంటనే వాటిని ఇంటి నుంచి బయటకు గెంటేయాలి.
  • ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ప్రధాన ద్వారానికి సమీపంలో మరుగుదొడ్డి, వంటగది ఉండకూడదు. ఇంటికి ఉత్తర దిశలో మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చు కానీ, దక్షిణం లేదా నైరుతి దిశలో మరుగుదొడ్డి నిర్మించడం మర్చిపోవద్దు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner