YVS Chowdary: వారిద్దరి ఫొటోలు నా ఆఫీస్‌లో ఉంటాయి.. దేవదాస్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కామెంట్స్-director yvs chowdary on nagarjuna ashwini dutt in ntr heroine launch swapna dutt supriya released veena rao first look ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yvs Chowdary: వారిద్దరి ఫొటోలు నా ఆఫీస్‌లో ఉంటాయి.. దేవదాస్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కామెంట్స్

YVS Chowdary: వారిద్దరి ఫొటోలు నా ఆఫీస్‌లో ఉంటాయి.. దేవదాస్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 01, 2024 08:16 AM IST

YVS Chowdary Comments On Nagarjuna Ashwini Dutt: దివంగత సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడు, జానకీరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు హీరోయిన్‌గా వీణారావును పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున, అశ్వనీదత్‌పై దేవదాస్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కామెంట్స్ చేశారు.

వారిద్దరి ఫొటోలు నా ఆఫీస్‌లో ఉంటాయి.. దేవదాస్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కామెంట్స్
వారిద్దరి ఫొటోలు నా ఆఫీస్‌లో ఉంటాయి.. దేవదాస్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కామెంట్స్

YVS Chowdary Comments In NTR Heroine Launch: తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ.. లెజెండరీ నటుడు ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.

హిట్ సినిమాల డైరెక్టర్ వైవీఎస్ చౌదరి

దేవదాస్, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య వంటి హిట్ సినిమాలు అందించిన డైనమిక్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌ని “న్యూ టాలెంట్ రోర్స్” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్‌కి (ఫస్ట్ లుక్) వరల్డ్ వైడ్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి వీణారావు

ఇక తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్‌ను తాజాగా పరిచయం చేశారు. ఆమె పేరే వీణారావు. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి వీణారావు హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇస్తోంది. నవంబర్ 30న వీణారావు ఫస్ట్ దర్శన్‌ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

ఆ కాంపౌండ్‌లో ఐదేళ్లు

"అశ్వనీదత్ గారి కాంపౌండ్‌లో దాదాపు ఐదేళ్ల పాటు ఉన్నాను. నా తొలి సినిమా వారి బ్యానర్‌లోనే చేయాల్సింది. తర్వాత నాకు అన్నపూర్ణలో డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. దత్తుగారు, నాగార్జున గారు ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. ఇద్దరు ఫోటోలు నా ఆఫీసులో ఉంటాయి" అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి పేర్కొన్నారు.

మహిళా శక్తులుగా ఎదిగిన

"వారి ఫ్యామిలీస్ నుంచి వచ్చి మహిళా శక్తులుగా ఎదిగిన సుప్రియ, స్వప్న చేతుల మీదుగా నేను కథానాయకగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణారావు ఫస్ట్ లుక్ దర్శన్‌ని లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకోసం ఈ వేడుకకి వచ్చిన వారికి ముందుగా ధన్యవాదాలు" అని వైవీఎస్ చౌదరి తెలిపారు.

మంచి భవిష్యత్తు ఉండాలని

"మా కథానాయకుడు నందమూరి తారక రామారావు గారి ఫస్ట్ దర్శనకి వరల్డ్ వైడ్‌గా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వీణారావుకి కూడా వరల్డ్ వైడ్ నుంచి మంచి ప్రశంసలు రావాలని కోరుకుంటున్నాను. వీణా మన తెలుగమ్మాయి. మంచి కూచిపూడి డ్యాన్సర్. అందాల రాశి. తనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు తనపై ఉండాలి" అని వైవీఎస్ చౌదరి కోరారు.

ఇదే రోజున ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్

"అన్నగారు నందమూరి తారక రామారావు గారు నాకు స్ఫూర్తి. ఆయన వల్లే నేను పరిశ్రమలోకి వచ్చాను. ఆయన నటించిన యుగంధర్, ఆడపడుచు సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వారిని స్మరించుకుంటూ ఈ రోజున మా కథానాయికని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం చిరస్మరణీయంగా భావిస్తున్నాను" అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తన స్పీచ్ ముగించారు.

Whats_app_banner