Brisk Walking: బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటి? రెగ్యులర్‌గా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!-what is brisk walking know the health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brisk Walking: బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటి? రెగ్యులర్‌గా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

Brisk Walking: బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటి? రెగ్యులర్‌గా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2024 07:00 AM IST

Brisk Walking: బ్రిస్క్ వాకింగ్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు చాలా ప్రయోజనాలు దక్కుతాయి. సాధారణ నడక కంటే బ్రిస్క్ వాకింగ్ చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆ వివరాలివే..

Brisk Walking: బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటి? రెగ్యులర్‌గా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
Brisk Walking: బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటి? రెగ్యులర్‌గా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది అత్యంత సులువైన వ్యాయామం కూడా. అయితే, బ్రిస్క్ వాకింగ్ చేయడం మరింత ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. సాధారణ వాకింగ్‍తో పోలిస్తే వేగంగా నడవడమే ఈ బ్రిస్క్ వాకింగ్. అయితే, దీనికి కొన్ని లెక్కలు ఉంటాయి. బ్రిస్క్ వాకింగ్ వివరాలు, ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.

బ్రిస్క్ వాకింగ్ అంటే..

మామూలు నడకతో పోలిస్తే వేగంగా నడిచే దాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. నిమిషానికి 100 స్టెప్స్ వేస్తే దాన్ని బ్రిస్క్ వాకింగ్‍గా పరిగణించవచ్చు. సాధారణ వాకింగ్‍లో గంటలకు సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు ఎక్కువ మంది నడుస్తారు. అయితే, గంటకు 4.8 నుంచి 6.4 కిలోమీటర్ల దూరం నడిస్తే దాన్ని బ్రిస్క్ వాకింగ్‍ అని కూడా కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. మొత్తంగా వేగంగా నడవడమే బ్రిస్క్ వాకింగ్. అయితే, చిన్న మార్పే అయినా సాధారణ నడక కంటే బ్రిస్క్ వాకింగ్ వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. రోజుకు కనీసం అరగంటైనా బ్రిస్క్ వాకింగ్ చేయడం మంచిది.

బ్రిస్క్ వాకింగ్ ప్రయోజనాలు

  • గుండెకు మేలు: రెగ్యులర్‌గా బ్రిస్క్ వాకింగ్ చేయడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేగంగా నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతుంది. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల గుండె వ్యాధుల రిస్క్ 30 శాతం వరకు తగ్గుతుందని కొన్ని స్టడీలు తేల్చాయి.
  • బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారు కూడా బ్రిస్క్ వాకింగ్ చేయడం మంచిది. స్పీడ్‍గా నడవడం వల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. ఫ్యాట్ కూడా మెరుగ్గా తగ్గేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు ఈ వాకింగ్ బాగా తోడ్పడుతుంది. మంచి ఫిట్‍నెస్ ఉంటుంది.
  • ఒత్తిడి తగ్గుతుంది: బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. మెరుగ్గా నిద్రపట్టేందుకు ఇది ఉపసరిస్తుంది. మూడ్ బాగా ఉండేలా చేస్తుంది.
  • కండరాలు, ఎముకలకు: బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కండరాలు, ఎముకల దృఢత్వానికి మేలు జరుగుతుంది. వేగంగా నడవడం వల్ల వీటిపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కండ వృద్ధికి ఇది తోడ్పడుతుంది. శరీర కింది భాగాలు మరింత బలంగా ఉండేలా, శరీర బ్యాలెన్స్ పెరిగేలా బ్రిస్క్ వాకింగ్ చేస్తుంది.
  • నొప్పుల నుంచి ఉపశమనం: బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కీళ్లు, కండరాల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ వాకింగ్ చేసే సమయంలో శరీరంలో ఎండార్ఫిన్ విడుదల మెరుగ్గా ఉంటుంది. దీంతో నొప్పిల నుంచి రిలీఫ్‍గా అనిపిస్తుంది.

 

బ్రిస్క్ వాకింగ్ చేయడం ఆరంభంలో కాస్త కష్టంగా అనిపించవచ్చు. అయితే రెగ్యులర్‌గా చేస్తూ దూరం పెంచుకోవాలి. నడక వేగం కూడా ఒకేసారి చాలా పెంచేయకుండా.. క్రమంగా అధికం చేస్తూ ఉండాలి. వేగంగా ఎక్కువ దూరం నడిచేందుకు అడుగులు దగ్గరిగా వేస్తూ వెళ్లడం తోడ్పడుతుంది. చేతులను ముందుకూ వెనక్కి ఊపడం కూడా నడకకు సహకరిస్తుంది.

Whats_app_banner