Creamy Garlic Mushroom Curry Recipe: పుట్టగొడుగుల కర్రీ ఇలా చేశారంటే సూపర్ అనాల్సిందే.. క్రీమీగా, టేస్టీగా..-creamy garlic mushroom curry recipe make this delicious dish at home like restaurant ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Creamy Garlic Mushroom Curry Recipe: పుట్టగొడుగుల కర్రీ ఇలా చేశారంటే సూపర్ అనాల్సిందే.. క్రీమీగా, టేస్టీగా..

Creamy Garlic Mushroom Curry Recipe: పుట్టగొడుగుల కర్రీ ఇలా చేశారంటే సూపర్ అనాల్సిందే.. క్రీమీగా, టేస్టీగా..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 30, 2024 05:30 PM IST

Creamy Garlic Mushroom Curry Recipe: క్రీమీగా ఉండే ఈ పుట్టగొడుగుల కర్రీ టేస్ట్ అదిరిపోతుంది. మరింత తినాలి అనిపించేలా నోట్లో కరిగిపోయేలా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్‍లో ఇంట్లోనే చేసుకోవచ్చు.

Creamy Garlic Mushroom Curry Recipe: పుట్టగొడుగుల కర్రీ ఇలా చేశారంటే సూపర్ అనాల్సిందే.. క్రీమీగా, టేస్టీగా..
Creamy Garlic Mushroom Curry Recipe: పుట్టగొడుగుల కర్రీ ఇలా చేశారంటే సూపర్ అనాల్సిందే.. క్రీమీగా, టేస్టీగా..

పుట్టగొడుగుల (మష్రూమ్)తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. కర్రీలను వివిధ రకాలుగా వండవచ్చు. వెరైటీలు ట్రై చేయవచ్చు. అదే విధంగా.. పుట్టగొడుగుల కర్రీని క్రీమీగా కూడా తయారు చేయవచ్చు. ఈ కర్రీ టేస్ట్ వారెవా అనేలా ఉంటుంది. నోట్లో వేసుకుంటే సూపర్ అనిపించేలా కుదురుతుంది. ఈ క్రీమీ అల్లం మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

క్రీమీ అల్లం మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు

  • 300 గ్రాముల పుట్టగొడుగులు
  • 2 టేబుల్ స్పూన్‍ల బటర్
  • ఓ టేబుల్ స్పూన్ నూనె
  • ఓ టేబుల్ స్పూన్ అల్లం (సన్నగా తరిగినది)
  • ఓ ఉల్లిపాయ (సన్నగా తరగాలి)
  • రుచికి సరిపడా ఉప్పు
  • ఓ టేబుల్ స్పూన్ కారం
  • అర కప్పు క్రీమ్ (ఇది లేకపోతే కొబ్బరి పాలు)
  • అర టీస్పూన్ గరం మసాలా
  • కాస్త కసూరిమేతి
  • ఓ టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు
  • రుచికి సరిపడా ఉప్పు

 

క్రీమీ అల్లం మష్రూమ్ కర్రీ తయారీ విధానం

  • ముందుగా పుట్టగొడుగులను నీటితో శుభ్రంగా కడగాలి. మరీ పెద్దగా ఉంటే సగానికి కట్ చేసుకోవచ్చు.
  • స్టవ్‍పై ఓ ప్యాన్ పెట్టి ముందుగా బటర్, నూనె వేయాలి.
  • బటర్ కరిగి బుడగలు వస్తుండగా అందులో సన్నగా తరిగిన అల్లం వేయాలి. కాస్త ఫ్రై చేయాలి
  • ఆ తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి.
  • ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక అందులో బాగా కడిన పుట్టగొడుగులను వేయాలి.
  • ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుతూ వేయించాలి. పుట్టగొడుగులు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • పుట్టగొడుగులు బాగా వేగాక అందులో కారం పొడి, క్రీమ్ వేయాలి. ఆ తర్వాత చిన్న మంటపై సుమారు 4 నిమిషాలు ఉడికించాలి.
  • ఇవి ఉడికాక గరం మసాలా, కసూరి మేతి, కొత్తమీర వేసుకొని అలా కలుపుకోవాలి. అంతే క్రీమీ అల్లం మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది.

 

ఈ క్రీమీ అల్లం మష్రూమ్ కర్రీని అన్నం, చపాతీల్లో తింటే అదిరిపోతుంది. క్రీమీ టెక్చ్సర్, పుట్టగొడుగుల మృధుత్వం, రుచి, బటర్ ఫ్లేవర్, అక్కడక్కడా అల్లం ముక్కలు తగులుతూ ఈ కర్రీ వావ్ అనేలా ఉంటుంది. సింపుల్‍గా పావు గంటలోనే చేసుకోవచ్చు. పుట్టగొడుగులు అంటే ఇష్టపడని వారికి కూడా ఈ కర్రీ తప్పకుండా నచ్చేస్తుంది. కర్రీని ఇలా చేయడం వల్ల పుట్టగొడుగుల్లోని పోషకాలు కూడా ఎక్కువగా పోవు. పోషక విలువలు మెండుగా ఉండాయి. ఇక, ఇందులో వేయాల్సిన క్రీమ్.. దాదాపు చాలా సూపర్ మార్కెట్‍లలో దొరుకుతుంది.

Whats_app_banner