పకోడి చాలా పాపులర్ స్నాక్. ఇది బాగుంటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఉల్లిపాయతోనే ఎక్కువగా పకోడి చేస్తుంటారు. అయితే, కాస్త డిఫరెంట్‍గా సేమియా కలిపి పకోడి చేయవచ్చు. ఈ ‘సేమియా పకోడీ’ విభిన్నమైన రుచితో, కరకలాడేలా క్రీస్పీగా ఉంటాయి. కొత్త తరహాలో పకోడీలు తినాలనుకునే వారిని మెప్పిస్తాయి. ఈ సేమియా పకోడీ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
సేమియా పకోడీ పర్‌ఫెక్ట్‌గా రావాలంటే సేమియాను పూర్తిగా ముద్దలా ఉడికించుకోకూదని గుర్తుంచుకోవాలి. పలుకుగా ఉండేలా ఉడికించుకోవాలి. లేకపోతే పకోడీ ముద్దలా, బజ్జీల్లా వస్తుంది. సేమియాను కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పిండి వేసి కలపాలి. అది కూడా ఎక్కువగా వత్తకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలి.