చలికాలంలో అంజీరాలను తింటే ఇంత మంచిదా - 6 లాభాలివే

image source https://unsplash.com/

By Maheshwaram Mahendra Chary
Dec 01, 2024

Hindustan Times
Telugu

 చలికాలంలో రోజూ ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి.

image source https://unsplash.com/

అంజీరాలో ముఖ్యంగా విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి తగినంత పోషణ అందుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వీటిని తినొచ్చు.

image source https://unsplash.com/

అంజీర్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. ఈ పండ్లను తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. 

image source https://unsplash.com/

అంజీర్ లో కాల్షియం, ఫాస్పరస్ లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

image source https://unsplash.com/

అంజీర్ లో ఉండే పలు సమ్మేళనాలు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతాయి. డయాబెటిక్ పేషెంట్లకు అంజీర్ మంచి ఎంపికని నిపుణులు చెబుతున్నారు.

image source https://unsplash.com/

అంజీర్ పండ్లలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం.

image source https://unsplash.com/

అంజీర పండ్లని నానబెట్టి ఉదయాన్నే తిని.. ఆ నీటిని తాగితే బాడీలోని టాక్సిన్స్ దూరమవుతాయి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ చలికాలంలోనూ చర్మం పొడి బారకుండా ఉంటుంది.

image source https://unsplash.com/

చలికాలంలో జలుబు నుంచి ఉపశమనం కలిగించే టీ ఇది

Photo: Pexels