అనాస పువ్వు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఔషద గుణాలు, పోషకాలు మెండుగా ఉంటాయి. చలికాలంలో అనాస పువ్వుతో చేసే టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.
Photo: Pexels
అనాస పువ్వులో యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‍ఫ్లమేటరీ,యాంటీ మైక్రోబయల్ గుణాలు మెండుగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.
Photo: Pexels
చలికాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల రిస్కును అనాస పువ్వు తగ్గిస్తుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించగలదు. దీంట్లో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటుంది.
Photo: Pexels
అనాస పువ్వుతో టీ చేసుకోవడం సులభం. ఓ గ్లాసు నీటిలో రెండు అనాస పువ్వులను వేసుకొని సుమారు 15 నిమిషాలు బాగా మరిగించాలి. ఆ తర్వాత వడగట్టాలి. ఆ టీలో రుచికోసం తేనె కలిపి తాగాలి. కావాలంటే నీరు మరిగే సమయంలో దాల్చిన చెక్క ఓ ముక్క కూడా కూడా వేసుకోవచ్చు.
Photo: Pexels
అనాస పువ్వు టీ రెగ్యులర్‌గా తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, గొంతు మంట నుంచి ఉపశమనం దక్కుతుంది.
Photo: Pexels
రక్తంలో చెక్కర స్థాయిని కూడా అనాస పువ్వు తగ్గించగలదు. డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ టీ తాగడం మేలు చేస్తుంది.
Photo: Pexels
అనాస పువ్వు టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తలనొప్పి నుంచి కూడా ఉపశమనం దక్కుతుంది.
Photo: Pexels
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.