Heart Health: మగవారిలో ఉదయం పూట ఈ లక్షణం కనిపిస్తే వారికి గుండె సమస్య ఉండే అవకాశం
Heart Health: గుండె సమస్యలు ఆడవారితో పోలిస్తే మగవారిలోనే అధికంగా వస్తున్నాయి. అయితే మగవారిలో ఉదయం పూట కనిపించే కొన్ని రకాల లక్షణాలు గుండెపోటు రాకను సూచిస్తాయి.
ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా గుండెపోటు సమస్య వస్తుందని తేలింది. మగవారిలో ఉదయం నిద్ర లేచాక కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వారి గుండెకు సరిగా రక్తప్రసరణ జరగడం లేదని అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఒక నిశ్శబ్ద సూచికగా భావించవచ్చు. ఇలాంటివారు గుండె పరీక్షలు చేయించుకోవాలి. అయితే పురుషుల్లో ఉదయం లేవగానే మార్నింగ్ వుడ్ అనే సమస్య ఎదురైతే వారి గుండె ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
మార్నింగ్ వుడ్ అంటే ఏమిటి?
మార్నింగ్ వుడ్ అంటే ఉదయం లేవగానే పురుషుల్లో అంగస్తంభన కనిపించాలి. మీరు నిద్రపోతున్నప్పుడు శరీరంలో టెస్టోస్టెరాన్ విడుదలవుతుంది. ఇది పురుషాంగ కణజాలానికి రక్త ప్రవాహాన్ని పెంచేలా చేస్తుంది. దీనివల్ల అంగస్తంభన జరుగుతుంది. ఆరోగ్యకరమైన పురుషుల్లో ఉదయం పూట అంగస్తంభన కచ్చితంగా జరుగుతుంది. అలా జరగకపోతే రక్త ప్రవాహం క్షీణించిందని అర్థం. అలాగే హార్మోన్ల స్థాయిలలో, నరాల పనితీరులో కూడా సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. లైంగిక ఆరోగ్యానికి లేదా గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో మీరు బాధపడుతున్నారని తెలుసుకోవాలి.
అంగస్తంభన అనేది హృదయ సంబంధ వ్యాధులకు ముందస్తు హెచ్చరికగా చెప్పుకుంటారు. కరోనారీ ధమనుల్లో అడ్డంకులు కలిగించే కొలెస్ట్రాల్, రక్తనాళాలు పనిచేయకపోవడం, ఫ్లేక్స్ ఏర్పడడం వంటివి కూడా పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి పురుషాంగానికి రక్త ప్రవాహం సరిగా జరగకపోతే అది గుండెకు కూడా జరగదని అర్థం చేసుకోవాలి.
2016లో రచించిన అధ్యయనం ప్రకారం అంగస్తంభన సమస్య ఉన్న పురుషుల్లో హృదయ సంబంధ వ్యాధులు కూడా బయటపడినట్టు గుర్తించారు. పురుషుల లైంగిక ఆరోగ్యం టెస్టోస్టెరాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మను వయసుతో పాటు తగ్గుతూ ఉంటాయి. తక్కువ స్థాయిలో ఈ హార్మోను గుండె వ్యాధులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఉదయం లేవగానే అప్పుడప్పుడు అంగస్తంభన లేకపోవడం అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్థిరంగా కొన్ని రోజులపాటు అంగస్తంభన కోల్పోవడం అనేది మాత్రం ప్రమాదకరమైనది. ఈ సమస్యతో పాటు ఛాతీ నొప్పి రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తే ఆ పురుషులు వెంటనే గుండె వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది. గుండె రక్తనాళాల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి వైద్యులు యాంజియోగ్రామ్, స్ట్రెస్ టెస్ట్ వంటి పరీక్షలు చేస్తారు.
ఒక మనిషికి రాత్రిపూట కూడా చెమటలు పట్టడం, నిద్ర సరిగా పట్టకపోవడం, పొట్ట సమస్యలు, తిన్నది అరగకపోవడం, తీవ్ర అలసట, బలహీనత, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటివన్నీ కూడా గుండె పోటు లక్షణాలగానే చెప్పుకుంటారు. గుండె పోటు వచ్చే ప్రమాదం ఉదయం పూటే ఎక్కువని కూడా అంటారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారిలో కూడా గుండె సమస్యలు రావచ్చు.
టాపిక్