Weight loss Yoga Poses: బరువు తగ్గేందుకు తోడ్పడే 3 యోగాసనాలు.. ప్రతీ రోజూ చేయండి!
Weight loss Yoga Poses: బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని యోగాసనాలు తోడ్పడతాయి. ప్రతీ రోజు ఈ ఆసనాలు సాధన చేయడం వల్ల త్వరగా వెయిల్ లాస్ అయ్యేందుకు సహకరిస్తాయి.
యోగా చేయడం వల్ల బరువు తగ్గుతారని చాలా మంది అనుకోరు. వ్యాయామాలే వెయిట్ లాస్‍కు ఉపయోగపడతాయని భావిస్తారు. అయితే, కొన్ని యోగాసనాలు కూడా బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. ప్రభావంతంగా పని చేస్తాయి. ప్రతీ రోజు యోగాసనాలు చేస్తే శరీర ఫ్లెక్సిబులిటీ, మానసిక ఆరోగ్యం, ఫిట్‍నెస్‍తో పాటు క్యాలరీలు కూడా ఎక్కువగా బర్న్ అవుతాయి. వెయిట్ లాస్‍కు ఉపయోగపడతాయి. రెగ్యులర్‌గా చేస్తే బరువు తగ్గేందుకు ఉపకరించే మూడు యోగాసనాలు ఏవో, ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
సూర్య నమస్కారాలు
బరువు తగ్గేందుకు యోగాలో సూర్య నమస్కారాలు ప్రభావంతంగా ఉపయోగపడతాయి. మొత్తంగా సూర్య నమస్కారాల్లో 12 ఆసనాలు ఉంటాయి. వీటిని క్రమంగా చేస్తే పూర్తి బాడీ వర్కౌట్ అవటంతో పాటు క్యాలరీలు, ఫ్యాట్ బర్న్ అవుతాయి. వంగడం, అవయవాలను సాగదీయడం సహా మరిన్ని శారీరక ప్రక్రియలు ఈ ఆసనాల్లో ఉంటాయి. మొత్తంగా బరువు తగ్గేందుకు సూర్య నమస్కార ఆసనాలు చాలా సహకరిస్తాయి.
ఉత్కటాసన
ఉత్కటాసనను కుర్చీ ఆసనం అని కూడా అంటారు. తొడ, తుంటి కండరాలను ఇది దృఢపరుస్తుంది. గాలిలో కుర్చీ ఉన్నట్టు ఊహించుకొని కాళ్లపై శరీర భారం ఉంచి వేసే ఆసనం ఇది. ఈ ఆసనం వేయడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. దీంతో క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. తొడల్లో కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
- ఆసనం ఇలా: ముందుగా ఓ చోట నిలబడాలి. ఆ తర్వాత కాళ్లను దూరంగా ఉంచి నిల్చోవాలి.
- శ్వాసను తీసుకొని అర చేతులు కిందికి ఉండేలా చేతులను ముందుకు చాపాలి.
- శ్వాస వదిలి మోకాళ్లను వంచాలి. ఆ తర్వాత నడుమును వంచి, కుర్చీలో కూర్చున్నట్టుగా ఊహించుకొని వంగాలి. పాదాలపై శరీర భారం ఉండాలి. ఇలా 30 సెకన్ల నుంచి నిమిషం వరకు ఉండాలి.
ధనూరాసన
ధనూరాసనం వేయడం వల్ల వెన్ను, ఛాతి, నడుము, చేతులు, పొత్తి కడుపు, కాళ్లకు మేలు జరుగుతుంది. ఈ ఆసనం వేస్తే పూర్తి శరీర ఫిట్‍నెస్ మెరుగవుతుంది. ధనస్సులా శరీరానికి వంచే ఆ ఆసనంతో ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది. జీవక్రియ వేగవంతమై వెయిట్ లాస్‍కు ఈ యోగాసనం తోడ్పడుతుంది.
- ఆసనం ఇలా: ఈ ఆసనం వేసేందుకు ముందుగా బోర్లా పడుకోవాలి.
- పొత్తి కడుపుపై భారం వేస్తూ రెండు మోకాళ్లను మడిచి.. చేతులతో పాదాలను పట్టుకోవాలి. మోకాళ్లు దూరంలో ఉండాలి.
- పాదాలను చేతులతో పట్టుకున్న సమయంలోనే ఆ తర్వాత ఛాతిని కూడా పైకి లేపాలి. ఇలా ఈ భంగిమలో సుమారు 20 సెకన్ల పాటు ఉండాలి.