తెలుగు న్యూస్ / ఫోటో /
Weight loss Tips: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? మిమ్మల్ని మీరు ఈ నాలుగు వేసుకుంటూ ఉండాలి!
- Weight loss Tips: బరువు తగ్గేందుకు చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు.. ఓ నాలుగు ప్రశ్నలు తమకు తాము వేసుకోవడం కూడా ముఖ్యం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- Weight loss Tips: బరువు తగ్గేందుకు చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు.. ఓ నాలుగు ప్రశ్నలు తమకు తాము వేసుకోవడం కూడా ముఖ్యం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 7)
బరువు తగ్గేందుకు వ్యాయమం, డైటింగ్ చేయడం చాలా మందికి తెలుసు. పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే అనుకుంటారు. అయితే, వీటిని అప్పుడప్పుడూ పాటించకపోవడం వల్ల బరువు తగ్గే ప్రయత్నానికి ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది.
(2 / 7)
బరువు తగ్గాలని అనుకుంటూ మీరు కూడా జాగ్రత్తలు సరిగా తీసుకోవడం లేదా? అయితే దీన్ని అధిగమించేందుకు మీకు మీరు నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి.
(3 / 7)
ఆ నాలుగు ప్రశ్నలకు మీకు మీరు సరిగ్గా, అర్థవంతమైన సమాధానం చెప్పుకోగలిగితే బరువు తగ్గే ప్రక్రియకు తోడ్పడుతుంది. అసలు ఆ నాలుగు ప్రశ్నలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
(4 / 7)
నిజంగా ఆకలిగా ఉందా?: చాలాసార్లు నిజంగా ఆకలి కాకపోయినా.. కాలక్షేపం కాక, ఒత్తిడికి గురైనప్పుడు, విసుగుగా ఉన్నప్పుడు ఆహారం తినేందుకు ప్రయత్నిస్తాం. అలాంటప్పుడు నీకు నిజంగా ఆకలవుతోందా? అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి. లేదు అనుకుంటే తినకూడదు. గ్లాస్ నీరు తాగి కాసేపు ఆగాలి. తినాలనే కోరిక తగ్గుతుంది. రోజులో చిటికీమాటికి తినడం వల్ల క్యాలరీలు ఎక్కువైపోయి బరువు తగ్గే ప్రయత్నానికి ఆటంకం కలుగుతుంది.
(5 / 7)
పోషకాహారమేనా?: వెయిట్ లాస్ కావాలనుకుంటున్న వారు పోషకాహారం తినడం చాలా అవసరం. ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు తినాలి. అందుకే తినే ముందు తీసుకునేదా పోషకాలు ఉండే ఆహారమేనా? అని ప్రశ్నించుకోవాలి. అది సరైనదే అనిపిస్తేనే తినాలి.
(6 / 7)
ఇంత ఆహరం తినొచ్చా?: పోషకాలు ఉండటంతో పాటు ఆహారాన్ని పరిమితంగా తినాలి. మరీ ఎక్కువగా తినకూడదు. ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటే క్యాలరీలు పెరిగిపోతాయి. అందుకే ఇంత తినడం అవసరమా? అని ప్రశ్నించుకోవాలి. కావాల్సినంత మేర మాత్రం తినేందుకు ఈ ప్రశ్న వేసుకోవడం సహకరిస్తుంది.
ఇతర గ్యాలరీలు