Cyclone Fengal : ఫెంగల్​ తుపానుతో చెన్నైలో భారీ వర్షాలు- ముగ్గురు మృతి!-cyclone fengal airport shut 3 electrocuted in chennai and storm to weaken today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyclone Fengal : ఫెంగల్​ తుపానుతో చెన్నైలో భారీ వర్షాలు- ముగ్గురు మృతి!

Cyclone Fengal : ఫెంగల్​ తుపానుతో చెన్నైలో భారీ వర్షాలు- ముగ్గురు మృతి!

Sharath Chitturi HT Telugu
Dec 01, 2024 08:10 AM IST

Cyclone Fengal : ఫెంగల్​ తుపాను తీరం దాటడంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ఆదవారం శాంతించనుంది.

ఫెంగల్​ తుపాను లైవ్​ అప్డేట్స్​..
ఫెంగల్​ తుపాను లైవ్​ అప్డేట్స్​.. (PTI)

తమిళనాడులోని ఉత్తర కోస్తా ప్రాంతాలు, పుదుచ్చేరి మధ్య ఫెంగల్ తుపాను తీరం దాటింది. ఈ తుపాను అర్ధరాత్రి సమయంలో స్థిరంగా ఉందని, నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడి ఉదయం 6 గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో తెలిపింది.

ఫెంగల్ తుపాను శనివారం సాయంత్రం పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సమీపంలో తీరం దాటింది. అయితే పొరుగున ఉన్న ఉత్తర తమిళనాడులో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో చెన్నై విమానాశ్రయ కార్యకలాపాలను అధికారులు కొద్దిసేపు నిలిపివేశారు.

ఫెంగల్ తుపాను కీలక అంశాలు..

  • తుపాను ట్రాకర్: తాజా ఐఎండీ అప్డేట్ ప్రకారం తమిళనాడులోని ఉత్తర కోస్తా ప్రాంతం, పుదుచ్చేరిలో ఫెంగల్ తుపాను స్థిరంగా ఉంది. అదే ప్రాంతంలో శనివారం అర్థరాత్రి 12:30 గంటలకు తుపానుగా కేంద్రీకృతమై ఉంది. గంటకు 65-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ తుపాను పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతుందని, రాగల మూడు గంటల్లో క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ తన బులెటిన్​లో పేర్కొంది.

  • తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు : ఫెంగల్ తుపాను ప్రభావంతో ఉత్తర తమిళనాడు, పొరుగున ఉన్న పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా పెద్దగా నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని, ఆదివారం నాటికి సంబంధిత వివరాలు తెలిసే అవకాశం ఉందని తమిళనాడు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు.
  • విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి: చెన్నైలో వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఒక వలస కార్మికుడు నగరంలోని ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతని మృతదేహం ఏటీఎం దగ్గర తేలుతూ కనిపించింది.
  • చెన్నై ఎయిర్​పోర్టు మూసివేత: భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసివేశారు. రెండు రన్వేలు, ట్యాక్సీవేపై నీరు నిలిచిపోవడంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 55 విమానాలను రద్దు చేయడంతో పాటు మరో 19 విమానాలను దారి మళ్లించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సర్వీసుల్లో దేశీయ, అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. శనివారం 12 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. విమానాశ్రయంలో విమానాలు రెడీ అవుతున్నట్టు ఇండిగో వెల్లడించిది.

  • 2015 వరద ముప్పు : 2015లో వచ్చిన వరదలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలు ఫ్లైఓవర్లు, వాటి కింద ఉన్న చోటును పార్కింగ్ స్థలాలుగా ఉపయోగించుకోగా, చెన్నై- దాని పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులు, ఇళ్లు నీట మునిగాయి. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ 2,32,200 మందికి ఆహారాన్ని పంపిణీ చేయగా, లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 200 మందిని ఎనిమిది సహాయ శిబిరాల్లో ఉంచారు. చెన్నైలోని 22 సబ్వేలలో ఆరింటిని తాత్కాలికంగా మూసివేశారు.
  • పుదుచ్చేరిలో భారీ వర్షాలు: పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటినప్పటికీ కేంద్రపాలిత ప్రాంతంలో పెద్దగా నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ఫెంగల్ తుపాను తీరం దాటే ముందు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ యూటీ యంత్రాంగం 12 లక్షల మంది నివాసితులకు ఎస్ఎంఎస్ పంపింది.

Whats_app_banner

సంబంధిత కథనం