భారీ వర్షాలు దక్షిణ భారత దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నాటకలో ఐదుగురు, తమిళనాడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భారత వాతావరణ శాఖ ఈ రెండు రాష్ట్రాలతో పాటు కేరళలో ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.