Cyclone Effect On Trains : ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నారు. తుపాను కారణంగా తిరుపతి, చెన్నై మార్గంలోని రైళ్ల ప్రయాణాల్లో మార్పులు చేశారు.
తిరుపతి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(16024) రైలును అవడి వద్ద షార్ట్ టెర్మినేట్ చేశారు. మరో రెండు రైళ్ల ఆరిజినేషన్‌లో మార్పు చేశారు. ఎంజీఆర్ చెన్నై - తిరుపతి(16053), ఎంజీఆర్ చెన్నై - ముంబై ఎల్టీటీ(12164) రైళ్ల ఆరిజినేషన్ ను తిరువళ్లూరుకు మార్చారు. గోరఖ్‌పూర్ - త్రివేండ్రం(12511), ధన్ బాద్- అలపుజ్జా(13351) రైళ్లను కొరుక్కుపేట్, పెరంబూర్ మార్గంలోకి మళ్లించారు.
ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తోన్న భారీ వర్షాలతో పలు రైలు సర్వీసుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
1. రైలు నెం.16054 తిరుపతి - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్‌ప్రెస్- 30.11.2024న 10.10 గంటలకు తిరుపతిలో బయలుదేరింది.
2. ట్రైన్ నెం. 12680 కోయంబత్తూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్ కోయంబత్తూరు నుంచి 30.11.2024న 06.25 గంటలకు బయలుదేరింది.
3. రైలు నం. 12610 మైసూరు - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ 30.11.2024న 05.00 గంటలకు మైసూరు నుంచి బయలుదేరి తిరువళ్లూరులో షార్ట్ టర్మినేట్ అవుతుంది.
4. రైలు నెం. 12163 లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ - 29.11.2024న సాయంత్రం 06.40 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ తిరువళ్లూరులో షార్ట్ టర్మినేట్ అవుతుంది.
5. రైలు నం. 22638 మంగళూరు సెంట్రల్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 29.11.2024న రాత్రి 11.45 గంటలకు మంగళూరు సెంట్రల్ నుంచి బయలుదేరి అరక్కోణంలో షార్ట్ టర్మినేట్ అవతుంది.
1. ట్రైన్ నెం. 16053 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ 30.11.2024న మధ్యాహ్నం 2.25 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరవలసి ఉండగా, తిరువల్లూరు నుంచి 3.45 గంటలకు బయలుదేరింది.
2. ట్రైన్ నెం. 12679 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-కోయంబత్తూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ 30.11.2024న మధ్యాహ్నం 2.35 గంటలకు Dr MGR చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరాలి 16.00 గంటలకు అవడి నుండి బయలుదేరుతుంది.
3. రైలు నెం. 12607 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కేఎస్ఆర్ బెంగళూరు లాల్‌బాగ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 30.11.2024న మధ్యాహ్నం 3.30 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలదేరాల్సి ఉండగా..అది తిరువళ్లూరు నుంచి 4.45 గంటలకు బయలుదేరింది.
4. రైలు నెం.12164 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 30.11.2024న సాయంత్రం 6.20 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరవలసి ఉండగా, తిరువళ్లూరు నుంచి 07.20 గంటలకు బయలుదేరుతుంది.
5. రైలు నెం. 12601 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - మంగళూరు సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ మెయిల్ 30.11.2024న రాత్రి 8.10 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరవలసి ఉండగా...అది తిరువళ్లూరు నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది.
6. రైలు నం. 12673 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - కోయంబత్తూర్ చేరన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 30.11.2024న రాత్రి 10.00 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరాలి, కానీ.. చెన్నై బీచ్ నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరుతుంది.
7. రైలు నెం. 12681 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - కోయంబత్తూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 30.11.2024న రాత్రి 10.30 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరాలి, కానీ చెన్నై బీచ్ నుంచి 11.00 గంటలకు బయలుదేరుతుంది.
8. రైలు నెం. 12657 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - కేఎస్ఆర్ బెంగళూరు సూపర్‌ఫాస్ట్ మెయిల్ 30.11.2024న రాత్రి 10.50 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరవలసి ఉండగా.. చెన్నై బీచ్ నుంచి 11.30 గంటలకు బయలుదేరుతుంది.
9. రైలు నెం. 12623 చెన్నై సెంట్రల్ తిరువనంతపురం సెంట్రల్ సూపర్ ఫాస్ట్ మెయిల్ 30.11.2024న సాయంత్రం 7.30 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరవలసి ఉంటుంది, కానీ చెన్నై బీచ్ నుంచి రాత్రి 8.00 గంటలకు బయలుదేరుతుంది.
10. రైలు నం. 22649 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- ఈరోడ్ ఏర్కాడ్ ఎక్స్‌ప్రెస్ 30.11.2024న రాత్రి 11.00 గంటలకు చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరాల్సి ఉంది, కానీ చెన్నై బీచ్ నుంచి 11.55 గంటలకు బయలుదేరుతుంది.
11. రైలు నెం. 06113 డాక్టర్ చెన్నై సెంట్రల్ - కొల్లాం ప్రత్యేక రైలు 30.11.2024న 11.20 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి 01.12.2024న 12.30 గంటలకు చెన్నై బీచ్ నుంచి బయలుదేరుతుంది.