Thalapathy Vijay Son: డైరెక్టర్‌గా దళపతి విజయ్ కుమారుడు- హీరోగా సందీప్ కిషన్- తమన్ సంగీతం- ఎక్కడ పోగొట్టుకున్నామో అంటూ!-thalapathy vijay son jason sanjay directed movie motion poster released starrer by sundeep kishan music by thaman ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay Son: డైరెక్టర్‌గా దళపతి విజయ్ కుమారుడు- హీరోగా సందీప్ కిషన్- తమన్ సంగీతం- ఎక్కడ పోగొట్టుకున్నామో అంటూ!

Thalapathy Vijay Son: డైరెక్టర్‌గా దళపతి విజయ్ కుమారుడు- హీరోగా సందీప్ కిషన్- తమన్ సంగీతం- ఎక్కడ పోగొట్టుకున్నామో అంటూ!

Sanjiv Kumar HT Telugu

Thalapathy Vijay Son Jason Sanjay Sundeep Kishan Movie: దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా మారాడు. దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్న జానస్ సంజయ్ తెరకెక్కిస్తోన్న సినిమాలో సందీప్ కిషన్ హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

డైరెక్టర్‌గా దళపతి విజయ్ కుమారుడు- హీరోగా సందీప్ కిషన్- తమన్ సంగీతం- ఎక్కడ పోగొట్టుకున్నామో అంటూ!

Thalapathy Vijay Son Jason Sanjay Directed Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమితమైన అభిమానులు ఉన్నారు. తమిళం, తెలుగు రాష్ట్రాల్లో విజయ్‌ను ఇళయ దళపతి అని ముద్దుగా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. విజయ్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.

బడ్జెట్‌కు మించిన కలెక్షన్స్

ఇక విజయ్ నటించిన చివరి సినిమా గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ) టాక్ పరంగా యావరేజ్‌గా నిలిచింది. కానీ, విజయ్ మేనియాతో బాక్సాఫీస్ వద్ద పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే, దళపతి విజయ్ సినిమాలు మానేస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

దర్శకుడిగా ఎంట్రీ

దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టనున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్నో గొప్ప సినిమాల‌ను రూపొందిస్తూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేయ‌టం కాకుండా, ఎంతో మంది న్యూ టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్స్‌కు స‌హ‌కారాన్ని అందిస్తూ ఎంక‌రేజ్ చేస్తోంది.

లైకా అనౌన్స్‌మెంట్

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయనున్నట్లు లైకా సంస్థ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ సినీ ఇండ‌స్ట్రీలో, సినీ ప్రేక్ష‌కులు, మీడియాలో ఆస‌క్తిని రేకెత్తించింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో చాలా మంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపించడంతో అందరి దృష్టిని ఆకర్షించాయి.

మోషన్ పోస్టర్ రిలీజ్

ఈ నేప‌థ్యంలో ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తాజాగా విడుదల చేయడం అంద‌రిలోనూ నూత‌నోత్సాహాన్ని నింపింది. ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జీకేఎమ్ త‌మిళ్ కుమర‌న్ మాట్లాడుతూ "ప్రారంభం నుంచి మంచి కథకులను ప్రోత్సహించడానికి లైకా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే జాసన్ సంజయ్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం" అని తెలిపారు.

డిఫరెంట్‌గా అనిపించింది

"జాసన్ సంజయ్ తెర‌కెక్కించబోతున్న క‌థ, ఆయ‌న నెరేష‌న్ విన్న‌ప్పుడు డిఫ‌రెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్ర‌ధాన‌మైన పాయింట్‌ ఉంది. మ‌నం ఎక్క‌డా పోగొట్టుకున్నామో అక్క‌డే వెత‌కాలి అన‌టాన్ని మనం చాలా సంద‌ర్భాల్లో వినే ఉంటాం. కానీ, దాని కోసం మ‌నం ఏం వెచ్చిస్తామ‌నేదే ప్ర‌ధాన పాయింట్‌గా సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు" అని తమిళ్ కుమరన్ అన్నారు.

సరికొత్త అనుభవాన్ని

"ఈ చిత్రంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ స‌రికొత్త కాంబో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభ‌వాన్నిస్తుంద‌ని మేం భావిస్తున్నాం" అని లైకా ప్రొడక్షన్స్ హెడ్ జీకేఎమ్ తమిళ్ కుమరన్ వెల్లడించారు.

తమన్ సంగీతం- జనవరి నుంచి షూటింగ్

అలాగే, సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుతూ "మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఇంకా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం. త్వ‌ర‌లోనే వారి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. 2025 జ‌న‌వ‌రి నుంచి సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నాం" అని తమిళ్ కుమరన్ పేర్కొన్నారు.