Netflix OTT Controversy: తమన్నా లవర్ విజయ్ వర్మ వెబ్ సిరీస్‌కు కష్టాలు- నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు కేంద్రం సమన్లు-government sent summons to netflix india content head over ic 814 the kandahar hijack ott release and controversy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott Controversy: తమన్నా లవర్ విజయ్ వర్మ వెబ్ సిరీస్‌కు కష్టాలు- నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు కేంద్రం సమన్లు

Netflix OTT Controversy: తమన్నా లవర్ విజయ్ వర్మ వెబ్ సిరీస్‌కు కష్టాలు- నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు కేంద్రం సమన్లు

Sanjiv Kumar HT Telugu
Sep 02, 2024 03:03 PM IST

IC 814 The Kandahar Hijack OTT Netflix Controversy: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన తమన్నా లవర్ విజయ్ వర్మ కొత్త వెబ్ సిరీస్ ఐసీ 814 ది కాందాహార్ హైజాక్ చిక్కుల్లో పడింది. ఈ సిరీసులో హిందువుల పేర్లను ఉపయోగించిన తీరుకు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.

తమన్నా లవర్ విజయ్ వర్మ వెబ్ సిరీస్‌కు కష్టాలు- నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు కేంద్రం సమన్లు
తమన్నా లవర్ విజయ్ వర్మ వెబ్ సిరీస్‌కు కష్టాలు- నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు కేంద్రం సమన్లు

Netflix OTT Controversy: ఓటీటీలో వచ్చే కంటెంట్‌కు ఎలాంటి హద్దులు, సెన్సార్ లేకపోవడంతో విభిన్న జోనర్స్, సీన్లతో సినిమాలు, వెబ్ సిరీసులు తెరకెక్కుతున్నాయి. దీంతో అవి ఓటీటీలోకి వచ్చాకా వివాదాల పాలు అవుతున్నాయి. ఇలా ఇప్పటికీ అనేక ఓటీటీ సినిమాలు, సిరీసులు చిక్కుల్లో పడ్డాయి.

నిజ జీవిత సంఘటనలతో

ఇప్పుడు తాజాగా మరో ఓటీటీ వెబ్ సిరీస్ చిక్కుల్లో పడింది. ఏకంగా ఆ సిరీస్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంటెంట్ హెడ్‌కు ప్రభుత్వం సమన్లు జారీ చేసేవరకు వెళ్లింది. ఆ వెబ్ సిరీస్ ఇంకేదో కాదు.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఐసీ 814 ది కాందాహార్ హైజాక్. ఇందులో తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ, అరవింద్ స్వామి, కునాల్ చోప్రా, కరణ్ దేశాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

1999 డిసెంబర్‌లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల సంఘటన ఆధారంగా 'ఐసీ 814' వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే, గత కొన్ని రోజులుగా వివాదాం ఎదుర్కొంటున్న ఈ సిరీసులో హైజాకర్ల పేర్ల విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

విమానం హైజాక్

ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు సమన్లు పంపించింది. ఈ వివాదానికి దారితీసిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మసూద్ అజహర్ సహా జైలులో ఉన్న ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత ప్రయాణికులను హైజాక్ చేస్తారు.

విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, షకీర్. కానీ, ఈ వెబ్ సిరీస్‌లో ఉగ్రవాదులకు 'శంకర్', 'భోలా' వంటి హిందూ పేర్లను, 'చీఫ్', 'డాక్టర్', 'బర్గర్' వంటి పేర్లను ఉపయోగించారు. దీంతో ఈ వివాదం రాజుకుంది.

పుస్తకం ఆధారంగా

ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్‌గా పేరొందిన కాందహార్ హైజాక్ నేపథ్యంలో ఐసీ 814 ది కాందాహార్ హైజాక్‌ను రూపొందించారు. కెప్టెన్ దేవి శరణ్, శ్రింజయ్ చౌదురు రాసిన పుస్తకం "ఫ్లైట్ ఇన్‌ టూ ఫియర్" ఆధారంగా ఈ సిరీస్‌ను అనుభవ్ సిన్హా తెరకెక్కించారు.

176 మంది ప్రయాణికులతో కాఠ్మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఐసీ 814 విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. కెప్టెన్ తలకు తుపాకీ పెట్టి విమానాన్ని కాబూల్‌కు తీసుకెళ్లాల్సిందిగా బెదిరిస్తారు. మరి ఆ ఫ్లైట్ కాబుల్‌కు ఎలా చేరింది? ఉగ్రవాదులు విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారు? వారి డిమాండ్స్ నెరవేర్చే క్రమంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వారిని ప్రభుత్వం ఎలా కాపాడింది? అనేది సిరీస్‌లో చూడాల్సిందే.

హిందీతోపాటు తెలుగులో

కాగా ఐసీ 814 కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌గా ఆగస్ట్ 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, ఇంగ్లీష్ ఇతర భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది ఈ వెబ్ సిరీస్.