Tamanna Bonam: బోనం ఎత్తుకున్న హీరోయిన్ తమన్నా.. 800 మందితో ఓదెల 2 క్లైమాక్స్-tamannaah bhatia carry bonam on telangana bonalu celebrations odela 2 climax with 800 artist in high budget temple set ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamanna Bonam: బోనం ఎత్తుకున్న హీరోయిన్ తమన్నా.. 800 మందితో ఓదెల 2 క్లైమాక్స్

Tamanna Bonam: బోనం ఎత్తుకున్న హీరోయిన్ తమన్నా.. 800 మందితో ఓదెల 2 క్లైమాక్స్

Sanjiv Kumar HT Telugu
Published Jul 30, 2024 11:39 AM IST

Tamanna Odela 2 Climax Scene: హీరోయిన్ తమన్నా భాటియా బోనం ఎత్తుకున్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓదెల 2 మూవీ క్లైమాక్స్‌ను 800 మందితో భారీ బడ్జెట్ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. అలాగే హైదరాబాద్ బోనాలు సందర్భంగా తమన్నా బోనం ఎత్తుకున్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

బోనం ఎత్తుకున్న హీరోయిన్ తమన్నా.. 800 మందితో ఓదెల 2 క్లైమాక్స్
బోనం ఎత్తుకున్న హీరోయిన్ తమన్నా.. 800 మందితో ఓదెల 2 క్లైమాక్స్

Tamannaah Bhatia Carry Bonam: వరుస సినిమాలతో దూసుకుపోతోన్న హీరోయిన్ తమన్నా భాటియా మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ మూవీ ఒదెల 2. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.

అంచనాలు పెరిగేలా

2021లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఒదెల రైల్వే స్టేషన్‌ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఓదేల 2 చిత్రానికి విజనరీ డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఓదెల 2 ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో ఈ సీక్వెల్‌పై ఎగ్జయిట్‌మెంట్‌ని పెంచడమే కాకుండా అంచనాలు కూడా పెరిగాయి.

టెంపుల్ సెట్‌లో

అయితే, ప్రస్తుతం ఈ హై బడ్జెట్ మల్టీలింగ్వల్ మూవీ హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలోని ఓదెల మల్లన్న టెంపుల్‌లో ఇంటెన్స్ క్లైమాక్స్ షూటింగ్‌తో జరుగుతోంది. అత్యంత కీలకమైన ఈ మ్యాసీవ్ టెంపుల్ సెట్‌ని హై బడ్జెట్‌తో నిర్మించారు. ఇంతటి భారీ బడ్జెట్ ఓదెల మల్లన్న టెంపుల్ సెట్‌లో క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. తమన్నా, ఇతర నటీనటులతో పాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

డివోషనల్ వైబ్

అంటే సుమారు 800 మందితో ఓదెల 2 క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నారు. అలాగే, హైదరాబాద్ బోనాలు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ తమన్నా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తమన్నా చీర కట్టుకుని, తలపై బోనం మోస్తూ చాలా అద్భుతంగా కనిపించింది. ఈ లుక్‌లో తమన్నా ఎంతో డివోషనల్ వైబ్‌ను ప్రసరించింది. కట్టు బొట్టు, అందమైన చిరునవ్వుతో బోనం ఎత్తుకున్న తమన్నా పోస్టర్ చాలా అట్రాక్ట్ చేస్తోంది.

సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్

దీంతో తమన్నా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కో ఇన్సిడెంట్‌గా బోనాల సంబరాలు జరుగుతున్నప్పుడు ఓదెల 2 మూవీ బోనాల ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు. తమన్నా భాటియా అద్భుతమైన పర్ఫామెన్స్ అందించడానికి ఇంటెన్స్ ట్రైనింగ్, రిహార్సల్స్‌ తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలను పర్ఫెక్ట్‌గా చేయడంలో ఆమె డెడికెషన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయని మేకర్స్ నమ్మకంతో చెబుతున్నారు.

డైరెక్టర్ సూపర్ విజన్

ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ని బ్లెండ్ చేయడంలో పేరున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సూపర్ విజన్ చేస్తున్నారు. అతని గైడెన్స్‌లో ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందించడానికి 'ఓదెల 2' రెడీ అవుతోందని తెలుస్తోంది.

మరో హీరోయిన్

ఓదెల 2 చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్ బాధ్యతల చేపట్టారు. ఓదెల 2 సినిమాలో తమన్నా భాటియాతోపాటు మరో హీరోయిన్ హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Whats_app_banner