
తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట కలకలం సృష్టించింది. కరూర్‌లో నిర్వహించిన సభలో తొక్కిసలాట కారణంగా 39 మంది మరణించారు. ఈ ఘటనపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మృతులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.



