Karthika Deeapam Today November 30: కుబేర్ మృతికి కారణం నేనే: కాంచనకు నిజం చెప్పిన కార్తీక్.. మరింత రగిలిపోయిన జ్యోత్స్న
Karthika Deeapam 2 Today Episode November 30: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్నకు గట్టిగా క్లాస్ తీసుకుంటాడు కార్తీక్. కుబేర్ మృతి, దీప పరిచయం గురించి కాంచన, అనసూయ ముందు నిజం చెప్పేస్తాడు. శివన్నారాయణ ఇంటికి దాసు వస్తాడు. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 30) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపను అంత ఇష్టపడడానికి కారణం ఏంటని కార్తీక్‍ను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. “అంతలా ఇష్టపడడానికి మిస్ హైదరాబాదా.. మిస్ ఇండియానా” అని అంటుంది. మిస్ హైదరాబాద్.. మిస్ ఇండియానే పెళ్లి చేసుకోవాలంటే సంవత్సరానికి ఇద్దరు మగాళ్లకు తప్ప ఎవరికీ పెళ్లిళ్లు అవవు అని కార్తీక్ అంటాడు.
దీప మెడలో అందుకే తాళి కట్టా
దీపను ఏం చూసి ఇష్టపడ్డావని జ్యోత్స్న మళ్లీ అంటుంది. “నా కంటే అందంగా ఉంటుందా.. నాకంటే స్టైల్‍గా ఉంటుందా.. నా కంటే ఎక్కువ చదువుకుందా.. నా కంటే ఎక్కువ ఆస్తి ఉందా. నా కంటే దీప ఎందులో ఎక్కువో చెప్పు బావా” అని అడుగుతుంది. “అందమంటే బాహ్య సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యం. అది దీపకు ఉంది. నీకు లేదు” అని కార్తీక్ అంటాడు. వెస్ట్రన్ వేర్ వేసుకున్నంత మాత్రానా స్టైల్ అయిపోదని చెబుతాడు. ఆ పద్ధతి దీపలో ఉందని నీలో లేదని అంటాడు. దీపకు ఉన్న జ్ఞానం నీకు లేదని చెబుతాడు. “దీప గుణంలో కోటీశ్వరురాలు. అది నీకున్న ఆస్తిగా కంటే గొప్పది. టోటల్‍గా చెప్పాలంటే దీపకు ఉన్న సహనం, ధైర్యం, ఔదార్యం, నిజాయితీ, నిస్వార్థం, మంచితనం, సహనం, ప్రేమ, సంస్కారం, గౌరవం ఇవి ఏవీ నీలో లేవు. ఇవన్నీ దీపలో ఉన్నాయి కాబట్టే ఆమె మెడలో తాళి కట్టాను” అని కార్తీక్ గట్టిగా క్లాస్ తీసుకున్నాడు.
త్యాగాలు చేశాను
నీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, ప్రాణాలైనా ఇస్తానని జ్యోత్స్న అంటుంది. దీంతో జోక్ అంటూ కార్తీక్ వెటకారంగా నవ్వుతాడు. చిన్నతనంలో కలువ పువ్వు కావాలనే అడిగితే తాను కోనేట్లో దిగానని, మునిగిపోతే నువ్వు పారిపోయావని కార్తీక్ గుర్తు చేస్తాడు. అది చిన్నప్పుడు అని జ్యోత్స్న అంటే.. అదే వయసు ఉన్న వేరే అమ్మాయి తనను కాపాడిందని అంటాడు. చేయి అందించని నువ్వు ప్రాణాలు ఇస్తానంటే నవ్వు కాక ఇంకేమొస్తుందని అన్నాడు. "ఆసుపత్రిలో రక్తం కావాల్సినప్పుడు నువ్వు కాదు.. దీప ఇచ్చింది. ఇది ఇప్పుడు ఈ దీప కాపాడిన ప్రాణం.. అందుకే అది దీపకే సొంతమైంది. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడు బాగా తెలుసు. నీకు ఏదైనా దక్కలేదంటే అది నీకు రాసిపెట్టిలేదని అర్థం. వదిలేసి పోతే అందరికీ మంచిది. ఇలా నా దారికి, కారుకు అడ్డుపడితే మనిద్దరికీ మంచిది కాదు” అని కార్తీక్ అంటాడు. కారు అడ్డుతీయకపోయినా పక్క నుంచి పోతానని, ఇబ్బందులను దాటుకుంటూ పోవడం అలవాటైపోయిందని చివరి పంచ్ గట్టిగా ఇస్తాడు కార్తీక్. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దీప లేకపోతే.. జ్యోత్స్నలో మరింత కసి
దీంతో జ్యోత్స్న మరింత రగిలిపోతుంది. రాసిపెట్టులేదన్నావ్ కదా.. నా రాత నేనే రాసుకుంటానని అనుకుంటుంది. “నా కంటే ఎక్కువైన దీప లేకపోతే.. నేనే కదా నీకు ఎక్కువ. దాన్ని అడ్డు తొలగించే పనిలోనే ఉన్నాను. ఆ గ్రానీ కొడుకు రాకపోయి ఉంటే దీప చావుకు ముహూర్తం పడి ఉండేది. కాస్త లేట్ అయినా అది జరుగుతుంది” అని జ్యోత్స్న అంటుంది.
నోరు జారిన అనసూయ
దీప బస్టాండ్‍లో దొరికిందని దాసుకు చెప్పిన విషయాన్ని కుబేర్ ఫొటో చూస్తూ గుర్తు చేసుకుంటుంది అనసూయ. మాట తప్పినందుకు క్షమించాలని ఫొటో చూస్తూ అంటుంది. నీ సొంత కూతురు కాదనే నిజం దీపకు తెలియకూడదు అని అనసూయ ఫొటో చూస్తూ అంటుంది. తెలిస్తే అంటూ సడెన్‍గా అంటాడు కార్తీక్. దీంతో కార్తీక్ బాబు వినేశారా అని కంగారు పడుతుంది అనసూయ. ఈ విషయం దీపకు తెలియకూడదని అంటున్నారు కదా.. ఏ విషయం అని కార్తీక్ అంటాడు. దీంతో వినలేదని కాస్త కుదుటపడుతుందని అనసూయ.
కుబేర్ ముందే తెలుసు.. ఆయన చావుకు కారణం నేనే
అంతలో కాంచన, దీప అక్కడికి వస్తారు. దీంతో కుబేర్ గురించి కార్తీక్ అడుగుతున్నారని అనసూయ అంటుంది. దీంతో కుబేర్ గురించి నువ్వో, దీపో చెబితేనే విషయాలు తెలిసేదని కాంచన అంటుంది. దీంతో నాకు కుబేర్ ముందే తెలుసని కార్తీక్ చెబుతాడు. సమయం వచ్చినప్పుడు చెబుతాదమని అనుకున్నానని, చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయని అంటాడు. “దీప వాళ్ల నాన్న చనిపోవడానికి కారణం నేనే” అని చెబుతాడు. దీంతో కాంచన షాకై కారణం నువ్వేంటి అని అడుగుతుంది. తాను లండన్‍కు వెళ్లే ముందే స్నేహితులతో వెళుతుండగా.. తాము ప్రయాణిస్తున్న కారుకు ఢీకొట్టి కుబేర్ చనిపోయారని గుర్తు చేసుకుంటూ వారికి చెబుతాడు కార్తీక్.
“నేను లండన్‍కు వెళ్లడానికి కంటే ముందు పార్టీ ఇవ్వడానికి వెళ్లిన రోజు.. కుబేర్ మా కారుకు గుద్దుకొని రోడ్డు మీద పడ్డారు. తలకు దెబ్బ తగలడం వల్ల నేను మాట్లాడుతుండగానే దీప.. దీప అంటూ చనిపోయారు” అని కార్తీక్ అంటాడు. దీంతో అనసూయ కన్నీరు పెట్టుకుంటుంది.
దీపతో పరిచయం అలా..
అప్పుడు అక్కడికి వచ్చిన దీప నాన్న చావుకు నన్నే కారణం అనుకుందని కార్తీక్ అన్నాడు. కొన్నాళ్లు తనను ద్వేషించిందని గుర్తు చేసుకున్నాడు. తాను నిజం చెప్పే అవకాశం ఇవ్వలేదని అన్నాడు. తప్పు చేయలేదని దీపతో గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. “ఆ తర్వాత అనుకోకుండా అత్త ప్రాణాలు కాపాడి అత్త ఇంటికి వచ్చింది. దీప కష్టాల్లో ఉందని అప్పుడే తెలిసింది. ఏదో ఒక రకంగా సాయం చేయాలనుకున్నాను. ఆ తర్వాత నిజం చెప్పాను. ఆ తర్వాత తనకు నిజం చెప్పాను. వాళ్ల నాన్న చావుకు నాకు సంబంధం లేదని అర్థం చేసుకుంది. ఎంత అర్థం చేసుకున్నా.. క్షమించినా.. ఒకవేళ నేను కారులో రోడ్డు మీదకు వెళ్లకపోయి ఉంటే ఆయన బతికి ఉండేవారని బాధపడుతూ ఉండేవాడిని. తండ్రి చనిపోవడంతో దీప అనాథ అయిపోయిందని అమ్మా. తనకు ఎవరూ లేరనుకున్నాను” అని కార్తీక్ కాంచనతో చెప్పాడు.
అసలైన అమ్మానాన్న బతికి ఉన్నారు
ఎమోషన్‍లో మరోసారి అనసూయ మాట జారుతుంది. లేకపోవడం ఏంటి బాబు.. దీప అసలైన అమ్మానాన్న బతికే ఉంటే అని అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దీపకు కుబేర్ తండ్రి కాదా అని కాంచన ప్రశ్నిస్తుంది. దీంతో అసలైన అమ్మానాన్న ఎక్కడో ఉంటారనే ఉద్దేశంతో నోరు జారానని మనసులో అనుకుంటుంది అనసూయ. దీప ఈ విషయంపై ప్రశ్నిస్తుంది. అయితే, నిజం చెప్పకుండా కవర్ చేస్తుంది అనసూయ. ఏదో అనేలోపే అపార్థం చేసుకున్నారని చెబుతుంది. ఈ విషయం కాంచనకు చెప్పకుండా ఉండాల్సిందని దీప అనుకుంటుంది. “తల్లిదండ్రులు దూరం అవడం ఎవరికైనా బాధే నీకు తల్లిలాంటి అత్త ఉంది. నువ్వు అందరూ ఉన్న దానివే” అని దీపతో కాంచన అంటుంది. ఏదో తేడా కనిపిస్తుందని అనుమానిస్తుంది దీప. దాసు ఏ విధం నీకు న్యాయం చేస్తారు.. అసలైన తల్లిదండ్రులను కనుగొంటారా, నీవ్వు ఏ ఇంటి వారసురాలివి అని అనసూయ అనుకుంటుంది. ,
శివన్నారాయణ ఇంటికి దాసు
జ్యోత్స్న కోపంగా ఇంటికి రావడంతో ఏమైందని పారిజాతం అడుగుతుంది. కార్తీక్ అన్న మాటలన్నీ జ్యోత్స్న చెబుతుంది. కోపంతో రగిలిపోతుంది. దీపను పొడిగిన విషయాన్ని, రాసిపెట్టి లేనందుకు తనతో పెళ్లి జరిగిందని అనడతంతో కాలిందని అంటుంది. ఏదో ఒకటి చేయాలని గ్రానీ అని దీప అంటుంది.
వారసురాలు దీపే అని అనసూయ ద్వారా తెలుసుకున్న దాసు.. శివన్నారాయణ ఇంటికి వెళతాడు. అమ్మా అని పారిజాతాన్ని పిలుస్తాడు. దీంతో దాసు నువ్వేంటి ఇలా వచ్చావని పారిజాతం అంటుంది. వచ్చింది నీ కోసం కాదమ్మా అని దాసు అంటుంటేనే.. మరి ఎవరి కోసం అంటూ శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. దశరథ్ అన్న, సుమిత్ర వదిన కోసం వచ్చానని, పిలిస్తే మాట్లాడి వెళ్లిపోతానని దాసు చెబుతాడు. వారు ఇంట్లో లేరని, రెండు మూడు రోజుల వరకు రారనని అంటాడు. “అన్నావదినలు ఉంటే.. దీపే మీ కూతురు అని చెప్పి ఉండే వాడిని” అని మనసులో అనుకుంటాడు దాసు.
పారిజాతం, జ్యోత్స్నకు అనుమానం
సుమిత్ర, దశరథ్‍లను దాసు అడగడంతో పారిజాతంలో అనుమానం మొదలవుతుంది. వాళ్లతో వీడికేంటి పని అని మనసులో అనుకుంటుంది. మమ్మీడాడీని అతడు కలవాల్సిన పనేంటి అని జ్యోత్స్న కూడా అనుకుంటుంది. ఇక వెళ్లిపోవాలని దాసుతో శివన్నారాయణ అంటాడు. మళ్లీ వస్తానంటే వద్దు అని గట్టిగా అరుస్తాడు. దీంతో అక్కడి నుంచి దాసు వెళ్లిపోతాడు. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు అని జ్యోత్స్నను శివన్నారాయయణ హెచ్చరిస్తాడు. దాసు ఎందుకు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. దాసును పిలిచి.. “మా మమ్మీడాడీతో నీకేంటి పని” అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ముగిసింది.