Andhra Pradesh News Live November 30, 2024: Fengal Cyclone Landfall : తీరాన్ని తాకిన ఫెంగల్ తుపాను, ఏపీలో అతి భారీ వర్షాలు-today andhra pradesh news latest updates november 30 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 30, 2024: Fengal Cyclone Landfall : తీరాన్ని తాకిన ఫెంగల్ తుపాను, ఏపీలో అతి భారీ వర్షాలు

Fengal Cyclone Landfall : తీరాన్ని తాకిన ఫెంగల్ తుపాను, ఏపీలో అతి భారీ వర్షాలు

Andhra Pradesh News Live November 30, 2024: Fengal Cyclone Landfall : తీరాన్ని తాకిన ఫెంగల్ తుపాను, ఏపీలో అతి భారీ వర్షాలు

02:41 PM ISTNov 30, 2024 08:11 PM HT Telugu Desk
  • Share on Facebook
02:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 30 Nov 202402:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Fengal Cyclone Landfall : తీరాన్ని తాకిన ఫెంగల్ తుపాను, ఏపీలో అతి భారీ వర్షాలు

  • Fengal Cyclone Landfall : ఫెంగల్ తుపాను తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరాన్ని తాకినట్లు ఐఎండీ పేర్కొంది. మరో 3-4 గంటల్లో తుపాను తీరం దాటనున్నట్లు తెలిపింది. తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202402:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Cyclone Effect On Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, ఫెంగల్ తుపాను ప్రభావంతో రైళ్ల సమయాల్లో మార్పులు

  • Cyclone Effect On Trains : ఫెంగల్ తుపాను కారణంగా తిరుపతి, చెన్నై మార్గంలోని పలు రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఇక చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే రైళ్ల.. ఆరిజినేషన్ మార్పు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202412:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CM Chandrababu : రేషన్ బియ్యం, బెల్ట్ షాపుల వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్, బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్

  • CM Chandrababu : బెల్ట్ షాపులు, రేషన్ బియ్యం రవాణా, ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. రేషన్ బియ్యం వ్యాపారులను వదలిపెట్టమన్నారు. ఇసుక విషయంలో కల్పించుకుంటే ఊరుకోమన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202412:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kadapa : మహిళా టీచర్ ఘరానా మోసం.. రైస్ పుల్లింగ్ పేరుతో రూ.1.37 కోట్ల స్వాహా

  • Kadapa : కడప జిల్లాలో ఘారానా మోసం బయటపడింది. ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు ఈ మోసానికి పాల్ప‌డింది. రైస్ పుల్లింగ్ పేరుతో ఏకంగా రూ.1.37 కోట్ల‌ను స్వాహా చేసింది. బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యిచడంతో నిందితురాలిపై కేసు న‌మోదు చేశారు. దీంతో ఆ మ‌హిళా టీచ‌ర్ ప‌రారీలో ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202410:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ongole Spa : పేరుకే స్పా సెంటర్.. లోపలంతా గలీజు పనులు.. గంజాయి ప్యాకెట్లు, కండోమ్‌లు!

  • Ongole Spa : అది పేరుకే స్పా సెంటర్. లోపల మసాజ్ కాకుండా.. ఇంకా వేరే గలీజు పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా పోలీసులు ఆ స్పా సెంటర్‌లో సోదాలు చేయగా.. కండోన్, గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు నోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202410:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: ANU Hostel Food : నాగార్జున వ‌ర్సిటీ హాస్టల్ భోజ‌నంలో క‌ప్ప, బొద్దింక‌-విద్యార్థినుల ఆందోళ‌న‌, వార్డెన్ బెదిరింపులు

  • ANU Hostel Food : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థినుల హాస్టల్ లో కలుషిత ఆహారం కలకలం రేపుతోంది. ఆహారంలో కప్ప, బొద్దింక, పురుగులు రావడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వర్సిటీ అధికారుల స్పందించకపోవడంతో అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202408:02 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Cyclone Fengal Effect : ఫెంగల్‌ తుపానుపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

  • Cyclone Fengal Effect : ఫెంగల్‌ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా.. సీఎం చంద్రబాబు తుపానుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టలు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202406:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati : ఏపీపై ఫెంగల్ పంజా.. ఈదురుగాలులతో కూడిన వర్షం.. విమాన సర్వీసులు రద్దు

  • Tirupati : ఫెంగల్ తుపాను ఏపీపై పంజా విసురుతోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తుపాను కారణంగా తిరుపతి నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు. వర్షం కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202406:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Murder Mystery : హాసిని హత్య కేసులో ఎన్నో మలుపులు.. సుపారీ హత్యగా అనుమానాలు!

  • Nellore Murder Mystery : నెల్లూరు జిల్లాలో ఓ హిజ్రాను అతి కిరాతకంగా చంపారు. ఈ హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. హత్య జరిగినప్పుడు గ్యాంగ్ వార్ అని పోలీసులు అనుమానించారు. కానీ.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెనక ఓ వ్యక్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202405:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!

  • Tirumala : తిరుమల.. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాంటి చోట కొందరు రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి ప్రసంగాల పట్ల భక్తులు ఆగ్రహం, ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202405:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం

  • Vizianagaram Road Accident : విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోల్తా పడిన కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202403:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Bapatla Crime : బాప‌ట్ల జిల్లాలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. పోక్సో కేసు న‌మోదు

  • Bapatla Crime : బాప‌ట్ల జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై వ‌రుస‌కు తాత అయ్యే అర‌వై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202403:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan District Tours : సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ - కార్యకర్తలతోనూ భేటీలు!

  • YS Jagan District Tours : ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా పర్యటిస్తానని… బుధ, గురువారాల్లో కార్యకర్తలతో భేటీ అవుతానని ప్రకటించారు. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202401:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains : ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్‌ - ఈ జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్స్' హెచ్చరికలు

  • Cyclone Fengal Updates: ఏపీకి ఐఎండీ కీలక అలర్ట్ ఇచ్చింది. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి