AP Rains : ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్‌ - ఈ జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్స్' హెచ్చరికలు-flash flood risk alert for three districts of andhrapradesh imd latest updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains : ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్‌ - ఈ జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్స్' హెచ్చరికలు

AP Rains : ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్‌ - ఈ జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్స్' హెచ్చరికలు

Cyclone Fengal Updates: ఏపీకి ఐఎండీ కీలక అలర్ట్ ఇచ్చింది. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

'ఫెంగల్ ' తుపాన్

నైరుతి బంగాళాఖాతంలో 'ఫెంగల్ ' తుపాన్ కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో కదులుతుందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 180 కి.మీ, చెన్నైకి 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తాజా బులెటిన్ లో వివరించింది.

ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని అంచనా వేసింది.

తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

తెలంగాణలోనూ వర్షాలు - హెచ్చరికలు జారీ

తెలంగాణకు కూడా ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి (నవంబర్ 30) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(డిసెంబర్ 1) తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

డిసెంబర్ 2వ తేదీన కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.

సంబంధిత కథనం