Weather ALERT : బంగాళాఖాతంలో తుపాన్ - దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు
- Cyclone Fengal Updates :నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ ఇవాళ్టి నుంచి వానలు పడనున్నాయి. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Cyclone Fengal Updates :నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ ఇవాళ్టి నుంచి వానలు పడనున్నాయి. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(1 / 8)
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ఈ తుపానుకు 'ఫెంగల్ 'గా నామకరణం చేశారు. ఉత్తర-వాయువ్య దిశగా 'ఫెంగల్ ' తుపాన్ పయనించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
(2 / 8)
తుపాన్ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో ఇవాళ,రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
(3 / 8)
ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి,నెల్లూరు,ప్రకాశం తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
(4 / 8)
దక్షిణకోస్తాలో ఇవాళ,రేపు అక్కడక్కడ భారీ -అతిభారీ వర్షాలు, రేపు కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ పేర్కొంది. రాయలసీమలో ఇవాళ,రేపు అక్కడక్కడ భారీ - అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల ఆదివారం వరకు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
(5 / 8)
(6 / 8)
(7 / 8)
ఇతర గ్యాలరీలు